Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి మిత్రులతో గొడవలు తొలగిపోయి మంచి వార్త తెలుస్తుంది. అలానే ఫిబ్రవరి 25 వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
మేషం..
ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ప్రయాణానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా సాగుతాయి.
వృషభం..
మిత్రులతో ఎటువంటి గొడవలు ఉన్నా కానీ కలిసిపోవడానికి ప్రయత్నించండి. ఆడవారు అయితే మీ స్నేహితురాలితో కొంచెం సేపు ఏకాంతంగా మాట్లాడితే ఇద్దరికీ జీవితంలో మంచి జరుగుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. బంధువర్గంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు సాగిపోతారు.
మిథునం..
ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారి తీస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. కుటుంబ పరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ సభ్యులను కూడా సంప్రదించండి. ముఖ్యమైన పనుల్లో బంధుమిత్రులు సహకరిస్తారు.
కర్కాటకం..
మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. పాజిటివ్ గా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుంది. ఆరోగ్యం కొంతవరకు కుదుటపడుతుంది. ఆకస్మిక ప్రయాణం తప్పకపోవచ్చు. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతున్నా పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. బాగా శ్రమ, తిప్పట ఉంటాయి. కొందరు బంధువుల వల్ల ఇబ్బంది పడతారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది.
సింహం..
ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా చాలావరకు మెరుగుదల కనిపిస్తుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. దూర ప్రాంతం నుంచి మంచి కబురు అందుతుంది. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త ఒకటి మీ చెవిన పడుతుంది. అనుకోని విధంగా మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.
కన్య..
ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండదు కానీ ఖర్చుల కారణంగా ఇబ్బంది పడతారు. బంధుమిత్రులు ఒత్తిడి తెస్తారు. మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి వేధింపులు ఉంటాయి. ఉద్యోగరీత్యా ప్రయాణానికి అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. స్నేహితులు పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి.
తుల..
దూరపు బంధువులతో మంచి వివాహ సంబంధం కుదురుతుంది. అనుకోకుండా అదనపు ఆర్థిక ప్రయోజనాలు మీ ముందుకు వస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి అడుగు వేయండి. స్పెక్యులేషన్కు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు వెళతాయి. ఐటీ నిపుణులు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు వెళతారు.
ఈ రాశి వారు పిల్లల నుంచి మంచి వార్త వింటారు (Daily Horoscope)..
వృశ్చికం..
కుటుంబంలో కొద్దిగా మనశ్శాంతి తగ్గుతుంది. ఎవరితోనూ వాదోపవాదాలకు దిగవద్దు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న సమాచారం ఒకటి అందుతుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం పర్వాలేదు.
ధనుస్సు..
ఒక శుభకార్యంలో పాల్గొంటారు. ఆలయాలకు వెళతారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ముందుకు సాగుతుంది. పిల్లల కారణంగా ఒక శుభవార్త వింటారు. ఉద్యోగంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగం మారటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అతి కష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. బంధువుల దగ్గర నుంచి డబ్బులు వసూలు అవుతాయి. మిత్రులకు సహాయపడతారు.
మకరం..
విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందిస్తుంది. బంధుమిత్రులతో సంబంధాలు మెరుగుపడతాయి. సన్నిహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. కొద్దిగా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు.
కుంభం..
ఆదాయంలో మెరుగుదల కనిపిస్తుంది కానీ శ్రమ, ఒత్తిడి బాగా పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణానికి అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. శుభవార్త వింటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి.
మీనం..
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఒకరిద్దరు స్నేహితులకు సహాయం చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అసంతృప్తి ఏర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/