Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుందని తెలుస్తుంది. అలానే ఫిబ్రవరి 16 వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
మేషం..
ఉద్యోగ విషయాల్లో సమయం బాగుంది.
వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా లాభపడతారు.
మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.
ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి.
వృషభం..
ఆత్మీయుల సహాయంతో ఒక కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. వ్యాపారం నిలకడగా ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్ వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. కొద్దిగా ఆదాయం పెరుగుతుంది. రుణ దాతల ఉత్తిడి తగ్గుతుంది. ఉద్యోగులు బాగా శ్రమ పడవలసి వస్తుంది. హామీలు ఉండవద్దు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మిథునం..
సమయం చాలా వరకు బాగుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురికి మేలు జరిగే పనులు చేస్తారు. చాలాకాలంగా ప్రయత్నిస్తున్న పని ఒకటి అనుకోకుండా పూర్తవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. సహచరులు బాగా సహకరిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక సమస్య పరిష్కారం అవుతుంది.
కర్కాటకం..
ఆశించిన స్థాయిలో ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. మీ మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. రుణ బాధ బాగా తగ్గుతుంది. వివాహ సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం పర్వాలేదు.
సింహం..
ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. బంధువులలో ఈ ప్రతిష్ట పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ ఫలించి ఆదాయం పెరుగుతుంది. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. స్నేహితుల నుంచి ఒత్తిడి ఉంటుంది. హామీలు ఉండవద్దు.
కన్య..
కొద్దిగా ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఉద్యోగ జీవితం మాత్రం ప్రశాంతంగానే సాగిపోతుంది. కొందరికి మీ వల్ల మేలు జరుగుతుంది. పట్టుదలకు పోకుండా పరిస్థితులను బట్టి వ్యవహరించండి. వృత్తి వ్యాపారాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఒక ముఖ్యమైన కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
తుల..
రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో సామాన్య ఫలితమే ఉంటుంది కానీ, ఆర్థిక పరిస్థితి మాత్రం కొంతవరకు మెరుగ్గా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమ ఉన్నప్పటికీ ఫలితం ఉంటుంది. కొన్ని వ్యక్తిగత పనులు పూర్తి చేస్తారు. స్నేహితుల నుంచి అవసర సహాయం అందుతుంది. బంధువులు మీ సహాయం తీసుకుంటారు.
(Daily Horoscope)ఈ రాశుల వారికి స్నేహితుల నుంచి సహకారం లభిస్తుందట..
వృశ్చికం..
ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండండి. ఉద్యోగ వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. అనవసర ఖర్చులు తడిసి మోపెడవుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. శుభవార్త వింటారు.
ధనుస్సు..
ఉద్యోగ పరంగా చాలా బాగుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. వ్యాపారం నిలకడగా ముందుకు సాగుతుంది. ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆనందం కలిగించే విషయాలు వింటారు. మంచి నిర్ణయాలు తీసుకోండి. ఈరోజు అంతా మంచే జరుగుతుంది.
మకరం..
కుటుంబ పరంగాను, ఉద్యోగ పరంగాను బాగా ఒత్తిడి ఉంటుంది. ఇతరుల సహాయంతో పనులు పూర్తి చేయాల్సి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో మరింత శ్రద్ధ అవసరం. ఇరుగుపొరుగుతో సమస్యలు ఉంటాయి. ఆదాయంతో పాటు ఖర్చులు బాగా పెరుగుతాయి. స్వల్పంగా అనారోగ్యం తప్పదు. వ్యాపారంలో పెట్టుబడి పెంచవలసి వస్తుంది. ఉద్యోగం మారటానికి ఇది సమయం కాదు.
కుంభం..
ఆర్థిక విషయాల్లో గ్రహ సంచారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనుల్లో ఏమాత్రం ఆలస్యం పనికిరాదు. వ్యాపారంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది.
మీనం..
చాలావరకు సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక సంబంధంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ఉన్నత యోగం ఉంది. మీ ప్రతిభకు విశేషమైన గుర్తింపు ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు సంపాదిస్తారు. ఆరోగ్యం పరవాలేదు. మంచి కంపెనీ నుంచి ఆఫర్ వస్తుంది. దూరపు బంధువులు కలుస్తారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/