Site icon Prime9

Cabinet Sub Committee Meeting: ముగిసిన కేబినెట్ సబ్ కమిటీ భేటీ… వాళ్లకు రైతు భరోసా కట్?

Cabinet Sub Committee Meeting: రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంతలో జరిగిన ఈ భేటీలో రైతు భరోసా విధి విధానాలపై గంటన్నరపాటు సమావేశం కొనసాగింది. ఎన్ని ఎకరాలకు రైతు భరోసా అమలు చేయాలనే విషయంపై కేబినెట్ సబ్ కమిటీ పూర్తిగా నిర్ణయించలేదు. అయితే సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేయనున్నట్లు సమాచారం.

ప్రధానంగా టాక్స్ పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగులను రైతు భరోసా అనర్హులుగా ప్రకటించాలని సూచనప్రాయ నిర్ణయం తీసుకున్నారు. అయితే మరోసారి రైతు భరోసాపై సమావేశం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల ద్వారా అభిప్రాయ సేకరణ జరగింది.

సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. సచివాలయంలో జరిగిన సబ్ కమిటీ భేటీకి సభ్యులు మంత్రి శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరరావు,పొగుేటి శ్రీనివాస్ రెడ్డితో సహా వ్యవసాయ అధికారులు సమావేశానికి హాజరయ్యారు.

Exit mobile version