Site icon Prime9

Ather Energy: ఏథర్ ప్రమోషన్ ఆఫర్.. ఈవీలపై రూ.25 వేల డిస్కౌంట్.. బెనిఫిట్స్ అరాచకం!

ather energy

ather energy

Ather Energy: ఏథర్ ఎనర్జీ తన ఫేమస్ స్కూటర్లు 450X, 450 అపెక్స్‌లపై స్పెషల్ ప్రమోషన్ ఆఫర్ ప్రకటించింది. ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు మోడళ్లపై రూ.25 వేల డిస్కౌంట్ అందిస్తోంది. పండుగ ఆఫర్‌లో 8 సంవత్సరాల బ్యాటరీ వారంటీ కూడా ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

పండుగ ఆఫర్‌లో 8 సంవత్సరాల బ్యాటరీ వారంటీ ఉంటుంది. ఈ వారంటీ ఉత్పత్తి విశ్వసనీయత పట్ల ఏథర్ ఎనర్జీ నిబద్ధతను మరింత పెంచుతుంది. ఈ బ్యాటరీ వారంటీ పొందడం ద్వారా కస్టమర్‌లు తమ బ్యాటరీలను ఎక్కువకాలం చింతించకుండా వినియోగించవచ్చు. దీని కోసం వినియోగదారులు ఎలాంటి అదనపు ఖర్చును భరించాల్సిన అవసరం లేదు.

ఏథర్ తన Ather గ్రిడ్ నెట్‌వర్క్ ద్వారా ఒక సంవత్సరం పాటు ఉచిత ఛార్జింగ్‌ను కూడా అందిస్తోంది. ఈ బెనిఫిట్‌తో వినియోగదారులు రూ. 5,000 ఉచిత ఛార్జింగ్‌ను పొందవచ్చు. Ather గ్రిడ్ భారతదేశం అంతటా 2,152 ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లను కలిగి ఉంది. ఇది వినియోగదారులకు అనుకూలమైన యాక్సెస్‌ను అదిస్తంది.

ఇది కాకుండా ఏదన స్కూటర్ కొనుగోలుపై రూ. 5,000 ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్ ఉంది. అలానే ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 10,000 వరకు క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంది.

కంపెనీ 450Xలో రెండు బ్యాటరీ ఆప్షన్స్ అందిస్తుంది. ఇది 2.9 kWh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 111 కి.మీ. రూ. IDC రేంజ్‌ని అందిస్తుంది. అదే సమయంలో మరొక 3.7kWh బ్యాటరీ అందుబాటులో ఉంది. ఇది 150 కి.మీ. టాప్ రేంజ్ అందిస్తుంది. 450 అపెక్స్ 157 కి.మీ. రూ. IDC పరిధిని ఆఫర్ చేస్తుంది.

Exit mobile version