Site icon Prime9

EV Offers: డిస్కౌంట్ల జాతర.. సగం ధరకే ఈ మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు.. స్మార్ట్‌ఫోన్ కంటే సవక..!

EV Offers

EV Offers

EV Offers: ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ కొనసాగుతోంది. సేల్‌లో అనేక ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. వీటిని 50 శాతం వరకు డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఇందులో గ్రీన్ ఉడాన్ ఎలక్ట్రిక్ స్కూటర్, EOX E1 ఎలక్ట్రిక్ స్కూటర్, Komaki X-ONE స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉన్నాయి. ఈ మోడళ్లన్నీ సులభ EMIలో బుక్ చేయవచ్చు. ఈ నేపథ్యంలో వీటిపై ఉన్న ఆఫర్లు, స్కూటర్ల ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

1. EOX E1 Electric Scooters
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర అమెజాన్‌లో రూ. 1,30,000. అయితే ప్రస్తుతం దానిపై 54 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. దీని కారణంగా మీరు దీన్ని రూ. 59,999కి కొనుగోలు చేయవచ్చు. ఇది మాత్రమే కాదు, దీనిని రూ. 2,938 EMI వద్ద కూడా కొనుగోలు చేయవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దీని రేంజ్ 80 కిమీ. ఇది 250 వాట్ల BLDC మోటార్, 32AH 60V బ్యాటరీని కలిగి ఉంది. దీని టాప్ స్పీడ్ గంటకు 25 కిమీ. స్కూటర్‌లో DLR ల్యాంప్, హై రిజల్యూషన్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్‌కు RTO రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు.

2. Green Flying Electric Scooter
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర అమెజాన్‌లో రూ. 69,000. ప్రస్తుతం దీనిపై 51 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. మీరు దీన్ని రూ. 33,999కి కొనచ్చు. ఇది మాత్రమే కాదు దీనిని రూ. 1,665 EMI వద్ద కూడా బుక్ చేయచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దీని రేంజ్ 60 కి మీ. ఇందులో 250 వాట్ల మోటారు ఉంది. దీని గరిష్ట వేగం గంటకు 25 కి.మీ. దీనికి 10 అంగుళాల వీల్స్ ఉన్నాయి. దీన్ని 4 నుంచి 6 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. ఈ స్కూటర్‌కు RTO రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు.

3. Komaki X-ONE Smart Electric Scooter
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర అమెజాన్‌లో రూ. 49,999. అయితే ప్రస్తుతం దానిపై 24 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. దీని కారణంగా రూ. 37,799కి ఆర్డర్ చేయచ్చు. ఇది మాత్రమే కాదు, దీనిని రూ. 1,851 EMI వద్ద కూడా దక్కించుకోవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 25 కిమీ రేంజ్ అందిస్తోంది. దీని గరిష్ట వేగం గంటకు 25 కి.మీ. దీనికి 10 అంగుళాల చక్రాలు ఉన్నాయి. దీన్ని 4 నుంచి 5 గంటల్లోఫుల్ ఛార్జ్ చేయవచ్చు. ఈ స్కూటర్‌కు RTO రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు.

Exit mobile version