Site icon Prime9

Earthquake in Bangkok, Myanmar: భారీ భూకంపంతో 59 మంది మృతి.. బయటకు పరుగులు తీసిన ప్రజలు

Earthquake of 7.7 magnitude hits Bangkok, Myanmar: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్, మయన్మార్‌లలో భారీ భూకంపం చోటుచేసుకుంది. కేవలం 12 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు సంభవించిన భూకంపాలతో ప్రజలు వణికిపోయారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై వరుసగా 6.4, 7.7గా నమోదైందని అధికారులు తెలిపారు. ఈ భూకంపాల ధాటికి చాలా భవనాలు కుప్పకూలగా.. మరికొన్ని భవనాలు ధ్వంసమయ్యాయి. దీంతో ప్రజలు భయాందోళనతో రోడ్లపైకి పరుగులు తీశారు.

 

భూకంప తీవ్రతకు మయన్మార్‌, థాయ్‌లాండ్ దేశాల్లో మృతుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. మయన్మార్‌లో 55 మంది, థాయ్‌లాండ్‌లో నలుగురు చనిపోయారని అధికారులు వెల్లడించారు. స్థానిక కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 1.30 గంటలకు బ్యాంకాక్‌లో ప్రకంపనలు వచ్చాయని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సెంట్రల్ మయన్మార్‌లోని మోనివా పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించింది.

 

ఇదిలా ఉండగా, భారీ భూకంపం ధాటికి మయన్మార్, థాయిలాండ్ దేశాల్లో చాలా మంది మృతి చెందారు. ఇప్పటికే మయన్మార్‌లో 55 మంది, థాయిలాండ్‌లో నలుగురు చనిపోయారు. అదే విధంగా పలు భవనాలు కుప్పకూలగా 250 మందికి పైగా గాయాలు కాగా.. 90 మంది గల్లంతు అయ్యారు. భవనాల శిథిలాల కింద చిక్కుకున్ వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నాయి. మరోవైపు , ఈ భూకంప ప్రభావం.. భారత్‌లోని కోల్‌కతా, ఇంఫాల్, మేఘాలయలో స్వల్పంగా ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు.

Exit mobile version
Skip to toolbar