Site icon Prime9

Laila Twitter Review: ‘లైలా’ ట్విటర్‌ రివ్యూ – విశ్వక్‌ లేడీ గెటప్‌పై నెటిజన్స్‌ ఏమంటున్నారంటే..!

Vishwak Sen’s Laila Movie Twitter Review in Telugu: మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ నటించి లేటెస్ట్‌ మూవీ ‘లైలా’ (Laila Movie). రామ్‌ నారాయణ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా లవర్స్‌ డే సందర్భంగా నేడు థియేటర్లోకి వచ్చింది. వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌ షో రన్‌ అవుతోంది. అయితే ఫస్టాఫ్‌ పూర్తి కావడంతో నెటిజన్స్‌ కొందరు ట్విటర్‌ వేదికగా తమ రివ్యూని తెలుపుతున్నారు. మరి ఈ సినిమా చూసిన నెటిజన్స్‌ ఏమంటున్నారు? లేడీ గెటప్‌లో విశ్వక్‌ అలరించాడా? లేదా? అనేది ఇక్కడ చూద్దాం.

విశ్వక్‌ వన్‌ మ్యాన్‌ షో

“లైలా కోసం విశ్వక్ సేన్ తొలిసారి లేడీ గెటప్ వేశాడు. ఆ క్యారెక్టర్ చేయానికి చాలా ధైర్యం కావాలి. లేడీగా విశ్వక్ సేన్ అదరగొట్టాడు. ఫస్టాఫ్‌ మొత్తం విశ్వక్‌ సేనే కనిపించాడు. సినిమా అంతా వన్ మ్యాన్ షో చేశాడు. విశ్వక్‌ నటన తప్పితే సినిమా చెప్పుకోవడానికి ఏం లేదు” అని ఓ నెటిజన్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

‘లైలా’ దారి తప్పిన సినిమా

పూర్తిగా దారి తప్పిన సినిమా 2/5 లైలా అనే సినిమా కథా రచన నుండి దర్శకత్వం, సంగీతం, నటుల అభినయం వరకు ప్రతీ అంశంలో విఫలమైంది. సినిమా చూసేంతసేపూ ఏదైనా ఆసక్తికరమైన సన్నివేశం వస్తుందా అని ఎదురుచూశా. అసలు ఎక్కడా కూడా కథ పట్టుదలగా కొనసాగలేదు.

మొదటి భాగం పూర్తిగా అర్ధరహితమైన సన్నివేశాలతో నిండిపోయింది. ప్రేక్షకులను బాగా బోర్ కొట్టించింది. కామెడీ పేరుతో వచ్చిన సీన్స్‌ అనవసరంగా పాతదోపు హాస్యంతో నిండిపోయాయి. ఇక రెండో భాగంలో కథ ఎక్కడికో దారి తప్పి, మరింత నిస్సత్తువుగా మారిపోయింది. ఎటువంటి ఉత్కంఠ లేకుండా, ముగింపు కూడా నిరాశపరిచేలా ఉండటంతో సినిమా పూర్తిగా విఫలమైంది. ఒక్క మరిచిపోలేని సన్నివేశం కూడా లేకుండా లైలా సినిమా పూర్తిగా నిరాశను మిగిల్చింది. విశ్వక్ సేన్, అతని టీమ్‌ లైలా మరిచిపోవాల్సిన చిత్రం మాత్రమే!

విశ్వక్‌ సేన్‌ తప్ప సినిమాలో చెప్పుకోవడానికి, చూడటానికి ఏమి లేదు. మరీ ముఖ్యంగా కథ ఎప్పుడో పాత చింతకాయి పచ్చడి కాలం నాటిది. స్క్రీన్‌ప్లే, మ్యూజిక్‌ సో.. సో. దర్శకత్వం అయితే పూర్తి నిరాశపరిచింది. విశ్వక్‌ సేన్‌ కష్టం వృథా అయింది. కానీ, లేడి గెటప్‌లో మాత్రం విశ్వక్‌ సేన్‌ పర్ఫెక్ట్‌గా ఉన్నాడు.

Exit mobile version
Skip to toolbar