Site icon Prime9

Yashoda: రూ.50 కోట్లు దాటిన యశోద ప్రీ రిలిజ్ బిజినెస్

yashoda

yashoda

Tollywood: సమంత నటించిన యశోద సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అద్బుతంగా జరిగింది. థియేట్రికల్ మరియు నాన్-థియేట్రికల్ రైట్స్‌తో సహా, ఈ చిత్రం వ్యాపారం రూ. 50 కోట్ల మార్కును దాటింది. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ దాదాపు 9 కోట్ల రూపాయల వరకు పలికాయి. అన్ని భాషల శాటిలైట్ హక్కులను కొనుగోలు చేయడానికి చర్చలు 12-14 కోట్ల రేంజ్‌లో కొనసాగుతున్నాయి. ఓవర్సీస్ రైట్స్ దాదాపు 1.5 కోట్లు వచ్చాయి.

ఈ సినిమా ఆడియో రైట్స్ కోటిరూపాయలకు అమ్ముడయితే ప్రీ-రిలీజ్ బిజినెస్ ఈ విధంగా జరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. హరీష్ నారాయణ్ మరియు హరి శంకర్ దర్శకత్వంలో ఫిమేల్ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

 

Exit mobile version