Site icon Prime9

Guppedantha Manasu: చీర కట్టులో మెరిసిపోయిన వసూ.. అంతలో రిషి వెనుక నుంచి వచ్చి..!

guppedantha mansu latest episode

guppedantha mansu latest episode

Guppedantha Manasu: తెలుగు లోగిళ్లలో గడపగడపనా ప్రసారమవుతున్న డైలీ సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ బుల్లితెరపై నిర్విఘ్నంగా ప్రసారమవుతూ ప్రేక్షకాదరాభిమానాలను సొంతం చేసుకుంటుంది. కాగా గుప్పెడంత మనసు గురువారం సెప్టెంబర్ 15 ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో చూసేద్దాం..

వసుధార సెలెక్ట్ చేసిన డ్రెస్ బాగోపోవడంతో ఆ డ్రెస్సుపై కావాలనే వసుధార కాఫీ పోసేస్తుంది. దానిని చూసిన దేవయాని వసూపై ఫైర్ అవుతుంది. ప్రతి పనిలోనూ తలదూర్చుతావెందుకని ఆగ్రహిస్తుంది. దానికి స్పందించిన రిషి..పర్వాలేదు పెద్దమ్మా వెళ్లి డ్రెస్సు మార్చుకుంటానని చెప్పి లోపలకు వెళతాడు. ఆ దుస్తులను రిషీ మార్చుకోవడానికి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అంతలో అక్కడ రిషీ తల్లిదండ్రులు జగతి-మహేంద్ర సరదాగా మాట్లాడుకోవడం చూసిన రిషి తనలో తానే మురిసిపోతాడు.

ఇక ఎప్పటిలానే ఓ మంచి డ్రెస్ సెలెక్ట్ చేసుకుని వెసుకుంటాడు రిషి. కాసేపయ్యాక వస్తానని చెప్పి తండ్రిని కిందకు పంపిస్తాడు రిషి. ఇక తర్వాతి సీన్ లో వసు చేతిలో కాఫీ కప్ చూసిన జగతి..అది నీ పనేనా అని అడుగుతుంది. అవును మేడం నేను సార్ కి షర్టు సెలెక్ట్ చేశాను. అది బాలేదు.. కానీ సర్ నాకోసం వేసుకున్నారు.. అందుకే నా తప్పును నేనే సరిచేసుకున్నా అని రిప్లై ఇస్తుంది.

సీన్ కట్ చేస్తే వసుధార…రిషి ఇచ్చిన చీర కట్టుకుని అద్దంలో తనని తాను చూసుకుంటూ మురిసిపోతుంటుంది. ఇంక తనలో తాను మాట్లాడుకుంటూ ఈ రోజు మీతో కాంప్లిమెంట్స్ తీసుకుని తీరుతాను రిషి సార్ మనసులో అనుకుంటుంది. ఇంతలో రిషి అక్కడి వస్తాడు. రిషిని చూసి ఉలిక్కిపడి వెనక్కు తిరుగుతుంది వసుధార. ఇద్దరూ ఒకర్నొకరు కళ్లలో కళ్లు పెట్టి చూసుకుంటూ ఉండిపోతారు. తనిచ్చిన చీరలో వసుని చూసి మైమరిచిపోయిన రిషి వసుధారకి దగ్గరగా వెళతాడు. వసుధారా ప్రపంచంలో ఇంత దగ్గరగా నేను ఎవర్నీ చూడలేదు నాకు దగ్గరివాళ్లుగా ఎవర్నీ భావించలేదు… ఇంతకన్నా ఎవ్వర్నీ ప్రేమించనేమో కూడా అంటాడు. దానితో వసు రిషి కళ్లలోకి చూస్తూ ఉండిపోతుంది. ఇలా గురువారం ఎపిసోడ్ ముగుస్తుంది.

ఇదీ చదవండి: Guppedantha Manasu: జగతి నగలతో ముడిపడిన రహస్యం… రిషిని చూసి బయపడిన దేవయాని ఎందుకంటే..?

Exit mobile version