Site icon Prime9

Gaalodu: గుడ్ బిగినింగ్ విత్ “గాలోడు”.. స్క్రీన్ పై మెరిసిన ఎన్నారై

gaalodu movie character artist NRI duggireddy felt happy with movie success

gaalodu movie character artist NRI duggireddy felt happy with movie success

Gaalodu: కోట్లకు పడగలెత్తినా రాని “కిక్” సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన క్షణం తనకు కలిగిందని అంటున్నారు ఎన్నారై బిజినెస్ మ్యాన్ వెంకట్ దుగ్గిరెడ్డి. “గాలోడు” చిత్రం చూసిన తన చిన్ననాటి స్నేహితులు, బంధువులు, తన ఊరివాళ్లు, తోటి ఎన్నారై ఫ్రెండ్స్ ఆప్యాయంగా అందిస్తున్న అభినందనలు తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయంటున్నాడు ఈ నెల్లూరీయుడు.

ఘన విజయం సాధిస్తున్న “గాలోడు” చిత్రంలో ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, హీరో సుడిగాలి సుధీర్, స్టార్ కమెడియన్ సప్తగిరి కాంబినేషన్ లో నటించి మెప్పించడం చాలా సంతోషాన్ని కలిగిస్తున్నదని అంటున్న వెంకట్ దుగ్గిరెడ్డి. ఈయన స్వస్థలం నెల్లూరు. చిన్నప్పటి నుంచి ఈయనకు నటనంటే ఎంతో మక్కువ.
పాతికేళ్ల క్రితం నెల్లూరు నుంచి అమెరికా వెళ్లి ప్రవాసాంధ్ర ప్రముఖుల్లో ఒకరిగా ఎదిగారు దుగ్గిరెడ్డి. కాగా తన కలను సాకారం చేసుకోవాలనే ఇండస్ట్రీలో అడుగుపెట్టానని అంతేకానీ నటన ద్వారా డబ్బు సంపాదించాలన్న ఆలోచన తనకు ఎంతమాత్రం లేదని తేల్చి చెపుతున్నాడు ఈ నెల్లూరీయుడు. ఎందరికో ఉపాధి కల్పిస్తూ, పన్ను రూపంలో కోట్లాది రూపాయలు చెల్లించే తనకు నటుడిగా పేరు తప్ప పారితోషికం అవసరం లేదని అంటున్నారు.

“గాలోడు” చిత్రంలో తనకు లాయర్ పాత్ర ఇచ్చి నటుడిగా వెండితెరపై అరంగేట్రం చేయించిన దర్శకనిర్మాత రాజశేఖర్ రెడ్డి పులిచర్ల, ఈ చిత్రంలో హీరోయిన్ ఫాదర్ గా నటించి మంచి మార్కులు కొట్టేసిన తన బెస్ట్ ఫ్రెండ్ రవి రెడ్డికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి: గర్భవతి అయిన మలైకా అరోరా.. ఆగ్రహం వ్యక్తం చేసిన అర్జున్ కపూర్

Exit mobile version