Site icon Prime9

Karthika deepam: సెప్టెంబర్ 14 మోనిత ఆడిన డ్రామా వల్ల సీరియల్ కొత్త మలుపు తిరగబోతుంది!

karthika deepam serial prime9news

karthika deepam serial prime9news

Karthika deepam: ఈ రోజు కార్తీకదీపం మోనిత ఆడిన కొత్త డ్రామా వల్ల సీరియల్ కొత్త మలుపు తిరగబోతుంది. ఆ సీన్ ఏంటో ఇక్కడ చదివి మీరే తెలుసుకోండి. కార్తీక్ మోనితకు టీ ఇస్తూ అప్పుడు నువ్వు మన బాబు గురించే ఆలోచిస్తున్నావా? అని అడుగుతాడు. అప్పుడు మోనిత ‘ఇదేంటీ నేను ఎప్పుడు ఏది చెప్పినా మరిచిపోయే కార్తీక్ బాబు ఇప్పుడు బాబు విషయం బాగానే గుర్తు పెట్టుకున్నాడు. ఐతే కార్తీక్ వంటలక్క తరువాత బాగా గుర్తుపెట్టుకున్న విషయం బాబు గురించి మాత్రమే. అప్పుడు మోనిత వెంటనే ఈ విధంగా ఆలోచిస్తుంది బాబు నాతో నా దగ్గార ఉంటే ఉంటే నాతో ప్రేమగా ఉంటాడు. మా బంధం కూడా బలపడుతుందని మనసులో అనుకుటుంది. నీకు ఒక విషయం చెప్పాలి మన బాబు దొరికాడు. ఇప్పుడే నీకు చెబుదాం అనుకున్నా ఇంతలో దాని గురించి నువ్వే మాట్లాడావ్ కార్తీక్ మన బాబు చెన్నైలో‌ ఉన్నాడు. నీకు ఆరోగ్యం బాగలేదు కదా. నువ్వు ఇప్పుడు ఏ ప్రయాణాలు చేయకూడదు. నేను ఒక్క దాన్ని వెళ్ళి బాబును తీసుకొస్తానని చెప్తుంది. రెండు రోజుల్లో బాబుని నీ ముందుకు తీసుకొచ్చి నీ చేతిలో పెడతానని చెప్తుంది. దానికి కార్తీక్ బాబు సరేనంటాడు. ఈ సీను ఇలా ముగుస్తుంది.

దీప, దీప వాళ్ల అన్నయ్య ఇంటికే వెళ్ళి ‘ఆ మోనిత మామూలది కాదు డాక్టర్ బాబుకి నా మీద లేనిపోనివి చెప్పి నా కోపం వచ్చేలా చేస్తుంది. ఇప్పటికే నేను కావాలనే మోనిత విషయంలో అన్ని చేసినట్లు చెప్పి డాక్టర్ బాబు దగ్గర చెడ్డదాన్ని చేసేసింది. ఇవి అన్ని తలచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. దానితో దీప వాళ్ళ అన్నయ్య దీపకు ధైర్యం చెప్పి తనని ఇంటికి పంపిస్తాడు. ‘వెళ్లమ్మా ఏం కాదు నీ భర్తకు కోపం వచ్చిన ఏమి అవ్వదు వచ్చిన కోపం ఎప్పటికీ అలాగే ఉండిపోదు కదా, నెమ్మదిగా అదే తగ్గిపోతుంది కొన్ని రోజుల తరువాత అన్ని మరిచిపోతాడు. కానీ నువ్వు మాత్రం చాలా దైర్యంగా ఉండాలి. మా బావని నువ్వు తొందరలో ఇంటికి తీసుకురావాలి. ఆ మోనిత నుంచి నీ భర్తని నువ్వు పూర్తిగా కాపాడుకోవాలి’ అంటూ ధైర్యం చెబుతాడు. రేపటి ఎపిసోడులో మరిన్ని విషయాలను తెలుసుకుందాం.

Exit mobile version