Site icon Prime9

Karthika Deepam : అక్టోబర్ 06 ఎపిసోడ్ లో దీప ఇచ్చిన బహుమతికి కార్తీక ఫిదా !

karthika-deepam 06 oct prime9news

karthika-deepam 06 oct prime9news

Karthika Deepam : నేటి కార్తీక దీపం సీరియల్ ఎపిసోడులో ఈ రెండు సీన్లు హైలెట్

కార్తీక్ పుట్టిన రోజును దీప సంతోషంగా జరుపుతుంది.కార్తీక్ కేక్ ఓపెన్ చేసి..కార్తీక్‌తో కట్ చేయిస్తుంది దీప.అప్పుడు కేక్ ముక్కను తీసుకొని కార్తీక్‌కి పెట్టేందుకు ఇద్దరు సిద్ధమవుతారు.ఇటు మోనిత..అటు దీప..ఐతే మోనిత పక్కనే ఉన్న దీప వాళ్ల అమ్మ..మోనిత కాళ్లు కావాలని గట్టిగా తొక్కుతుంది .దాంతో మోనిత చేతిలోని ముక్క జారి కింద పడిపోతుంది. ‘చూసుకోలేదమ్మా’ అని ఏమి ఎరగనట్టు అంటుంది.వీరందరూ కావాలనే ఇలా చేస్తున్నారని కోపంతో రగిలిపోతుంది మోనిత.ఇక కేక్ కటింగ్ తర్వాత కార్తీక్ చాలా సంతోషంగా ఉంటాడు. ‘చాలా థాంక్స్ దీప..ఏది గుర్తుందా లేకపోయినా ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటాను..నా మతి మరుపుని కూడా అధిగమించి..గుర్తు పెట్టుకునేంత ఘనంగా జరిపించావ్.. అయ్యో డాక్టర్ బాబు ఇంకా అవ్వలేదు.. మీ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు రక్తదాన శిభిరం ఏర్పాటు చేస్తున్నా.. తర్వాత పేదలకు అన్నదానం..కూడా..హాస్పిటల్ రోగులకి పండ్లు పంపిణి చేసి ఇదంతా మీ చేతుల మీదులాగనే చేయాలంటుంది దీప.

దీప ఇచ్చిన బహుమతికి కార్తీక ఫిదా

‘ఎందుకు దీప అంత ఖర్చు? అని కార్తీక్ అంటాడు.‘ఇవి నా డబ్బులు కాదు డాక్టర్ బాబు..మీరు మొన్న ఇచ్చారు కదా..వాటినే దాచా అని అంటుంది.వెంటనే కార్తీక్‌కి ఆ రోజు జరిగిన ఒక సంఘటన గుర్తొస్తుంది.‘కేక్ కటింగ్ అయిపోయింది కదా.. ఇక వెళ్దామా అని కార్తీక్ చేయి మోనిత పట్టుకుంటుంది.హా.. ఒక్క నిమిషం డాక్టర్ అమ్మా అంటూ దీప వాళ్ళని ఆపుతుంది. వెంటనే దీప..పర్స్ అందిస్తూ..‘డాక్టర్ బాబు..మీకు ఈ పర్స్ గుర్తుందా? పోయిన సంవత్సరం మీ పుట్టిన రోజుకి మీకు ఇది బహుమతిగా ఇచ్చానని అంటుంది దీప. వెంటనే అందుకున్న కార్తీక్..‘నిజంగానా నా లాస్ట్ బర్త్‌డేకి ఇది బహుమతిగా ఇచ్చావా? మరి నీకు గుర్తు లేదా మోనితా?’ అని కార్తీక్ అంటాడు.

Exit mobile version