Site icon Prime9

Guppedantha Manasu: అక్టోబర్ 04 ఎపిసోడ్ లో ” నాకు నా ప్రేమ కావాలి డాడ్ ” అని అడిగిన రిషి

guppedantha manasu serial 04 Oct prime9news

guppedantha manasu serial 04 Oct prime9news

Guppedantha Manasu: నేటి గుప్పెడంత మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఈ రెండు సీన్లు హైలెట్

రిషి, మహేంద్ర ఇద్దరు ఇలా మాట్లాడుకుంటారు

‘డాడ్ నేను నడుస్తుంటే నాకొక ముల్లు గుచ్చుకుంది.ఆ ముళ్లు నన్ను బాగా బాధ పడేలా చేస్తుంది.ఆ ముల్ల బంధాలను దూరం చేస్తే అది విషంగా మారుతుందేమోనని భయంగా ఉంది..డాడ్..ముళ్లు కాలికే గుచ్చుకుంటే నేనే తీసుకునేవాడిని డాడ్..కానీ ఆ ముల్లు గుండెల్లో గుచ్చుకుంది.అది ఎవరు తీస్తారని బాధగ అంటాడు రిషి.అప్పుడు మనసులో మహేంద్ర ఇలా ‘రిషి గురు దక్షిణ ఒప్పందం విషయంలో డైరెక్ట్‌గా చెప్పలేక ఇలా సూటిపోటి మాటలు మాట్లాడుతున్నావా?’ అని అనుకుంటాడు ‘మీరేం చెయ్యలేరా డాడ్’ అని రిషి అడగగా చాలా నిస్సహాయంగా చూస్తూ…‘చెయ్యాలని నాకు చాలా ఉంది రిషి.. కానీ..’ అని ఆగిపోతాడు మహేంద్ర.

నాకు నా ప్రేమ కావాలి డాడ్ అని అడిగిన రిషి

‘అమ్మని తెచ్చి ఇవ్వమనే వాడివి..కానీ అది తప్ప నేను అన్నీ ఇచ్చేవాడిని అని మహేంద్ర అంటాడు.‘ఆ ఒక్క విషయమే.. ఇప్పుడు నా జీవితంలో నా ఆనందాన్ని దూరం చేయనుందా అని రిషి బాధగా అంటాడు.‘నీ ఆనందం కోసం ఏ ఆనందాన్ని కూడా నేను వదులుకోగలను రిషి’అని మహేంద్ర ఎమోషనల్‌గా అంటాడు.వెంటనే రిషి మహేంద్ర రెండు చేతులను పట్టుకుని.. ‘డాడ్ నాకు వసుధార కావాలి.. కానీ ఎలాంటి ఒప్పందాలు షరతులు లేకుండా అచ్చంగా వసుధార మాత్రమే కావాలి.. ఇవ్వగలరా? అని.. ఆ ఒక్క విషయం వల్ల నా ప్రేమని వదులు కోవాల్సిన పరిస్థితి వస్తోంది…నాకు వసుధార కావాలి డాడ్.. వసుధార వసుధారలానే కావాలంటూ మహేంద్రను హత్తుకుని రిషి చాలా ఎమోషనల్ అవుతాడు. తరువాత ఏమి జరగనుందో రేపటి ఏపిసోడులో తెలుసుకుందాం.

ఇదీ  చదవండి :Karthika Deepam : అక్టోబర్ 04 ఏపిసోడ్ లో ” గుర్తొస్తుంది మోనితా.. కానీ దానిలో నువ్వు లేవంటున్నా” కార్తీక్

Exit mobile version