Guppedantha Manasu: నేటి గుప్పెడంత మనసులో ఎపిసోడ్ లో ఈ రెండు సీన్లు హైలెట్
కాలేజ్ రిషితో వసు.. ‘సార్ వాళ్లు వెళ్లిపోవడానికి ఒక విధంగా మనం కూడా ఒక కారణం కావచ్చు సార్’ అని అంటుంది.ఆ మాటలకు రిషి కోపంగా.. ‘వసుధారా.. నువ్వు నాకు లేనిపోనివి తలకు ఎక్కించకంటూ అని కసరుకుంటాడు.‘అది కాదు సార్.. మీరు జగతీ మేడమ్‌ని కానీ.. ఏదైనా..’ అంటూ మాటను కూడా బయటకు రాకుండానే ‘వసుధారా ఆపుతావా?’ అంటూ గట్టిగా అరుస్తాడు రిషి. అలా ఇద్దరి మధ్య వాదన కాస్తా.. రిషి ఆవేదనగా మారిపోతుంది. ‘మా డాడ్ ఎక్కడున్నా కాలేజ్ రావాల్సిందే. అందుకే ఈ మీటింగ్ అని అఫీషియల్‌గా మెయిల్ చేశాను..మీటింగ్ సమయానికి వాళ్లు కచ్చితంగా ఇక్కడికి వస్తారని రిషి అంటాడు.
రిషి అనుకున్నట్టుగా మహేంద్ర , జగతి మీటింగ్ కు హాజరు కారు. ఇక మీటింగ్ క్యాన్సిల్ చేయగానే.. దేవయానికి తన మనుషులు ఫోన్ చేసి చెబుతారు.‘అమ్మయ్యా…ఇది మంచి వార్తా ఎక్కడ మహేంద్ర వాళ్లు ఆ మీటింగ్ వస్తారోనని భయపడి చచ్చాను..కదా ఇక నా డ్రామాలు నేను కొనసాగిస్తానంటూ అని మనసులో సంబరంగా అనుకుంటుంది.మరోవైపు రిషి.. వసుని తీసుకుని.. గౌతమ్ పంపించిన లొకేషన్‌కి వెళ్లిపోతాడు.రిషిని చూసి గౌతమ్, మహేంద్ర, జగతీ ముగ్గరూ షాక్ అయిపోతారు. ఇదీ చదవండి :Karthika Deepam: అక్టోబర్ 25 ఎపిసోడ్ లో దీప వైపు అడుగులేస్తున్న కార్తీక్ బాబు
మహేంద్ర కోపంగా.‘అయ్యో అంకుల్.. రిషికి లొకేషన్ పంపించింది నేనే కానీ నేను మీ గురించి చెప్పి మిమ్మల్ని బాధపెట్టాలని కాదు..మీటింగ్ తర్వాత వస్తాడులే కానీ వీడు ఇప్పుడే వచ్చేశాడు…వాడిని ఓదార్చాలనే పిలిచానని గౌతమ్ అంటాడు గౌతమ్. ‘సరే గౌతమ్.. జగతి నేను లోపలికి వెళ్తున్నాం.. మేము ఇక్కడే ఉన్నామని కానీ వాడికి చెప్పావో.. ఇక జీవితంలో నీతో మాట్లాడను.. నువ్వు ఈ విషయం గుర్తు పెట్టుకో’ అనేసి వేరే గదిలోకి వెళతారు. అప్పుడే గౌతమ్ వెళ్లి తలుపు తీస్తాడు. రిషి తలుపు తియ్యగానే.. పరుగున పరుగున వెళ్లి.. ‘డాడ్ ఎక్కడున్నారు’ అంటూ చాలా ఆవేదనగా పిలుస్తాడు.అప్పుడే మహేంద్ర, జగతీలు ఆ పక్కగా దాక్కుంటారు.. రిషి ఈ పక్కంతా వెతుకుతాడు.. కానీ వాళ్ళు కనిపించరు. ఆ సీన్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది.తరువాత ఏమి జరగనుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.
ఇదీ చదవండి :Gruhalakshmi: అక్టోబర్ 25 ఎపిసోడ్ లో ఏకాంతంగా మాట్లాడుకున్న సామ్రాట్, తులసి!