Site icon Prime9

Devatha: ‘నాన్నా నేనంటే నీకు నిజంగానే ఇష్టమేనా?’ అని అడిగిన మాధవ కూతురు

devatha prime9news

devatha prime9news

Devatha Today: నేటి దేవత సీరియల్ ఎపిసోడ్ లో ఈ రెండు సీన్లు హైలెట్. చిన్మయి దిగులుగా కూర్చుని, దేవి గురించే  ఆలోచిస్తుంది ఉంటుంది. దేవికి ఏమైందో తెలుసుకోవాలని అనుకుంటుంది. అప్పుడే మాధవ చిన్మయి దగ్గరకు వచ్చి  ‘అమ్మా ఇక్కడున్నావేంటీ? ఈ మధ్య ఎందుకు నువ్వు దిగులుగా  కనిపిస్తున్నావ్’ అంటూ ఆరా తీస్తాడు. ‘ఏం  లేదు నాన్నా, బాగానే ఉంటున్నాను’ అని అబద్దం చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. వెళుతూ  వెళుతూ  ఆగి, వెనక్కి తిరిగి ‘నాన్నా నేనంటే నీకు నిజంగానే ఇష్టమేనా?’ అని అడుగుతుంది. ‘అదేం ప్రశ్న తల్లీ’ అని మాధవ అడుగుతాడు.

ఆ మాటలు రాధ చెవిన పడటంతో, మాధవకు బాగా గడ్డిపెడుతుంది. వింటున్నావా పసిబిడ్డకే అలాంటి మాటలు వస్తున్నాయంటే, తనెంత బాధపడితే అలా మాట్లాడుతుంది ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికైనా మారు. ఇప్పటికే నువ్వు  మనిషిగా ఎప్పుడో చచ్చిపోయావ్. ఇప్పటికి కూడా నువ్వు మారలేదు అంటే నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు’ అనేసి వెళ్లిపోతుంది. ఆ సీన్ ఈ రోజు సీరియల్లో చాలా బాగుంటుంది. రాధా మాటలన్ని విన్న తరువాత మాధవ ఆలోచనలో పడతాడు. తరువాత ఏమి జరగనుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

Exit mobile version