Site icon Prime9

Devatha: సెప్టెంబర్ 24 ఏపిసోడులో రెచ్చిపోతున్న మాధవ్

devatha prime9news

devatha prime9news

Devatha serial: నేటి దేవత ఏపిసోడులో ఈ సీన్లు ఏడిపించేశాయి. మాధవ్ చేసిన మోసాలను తెలుసుకున్న జానకీ కింద పడిపోతుంది. వెంటనే పరుగున వెళ్లి, జానకీ చేతిలోని తాళి, ముహూర్తం పేపర్ తీసుకొని మళ్లీ పైకి ఎక్కేస్తాడు. ఏమి తెలియనట్టు కిందకి వచ్చి అమ్మా, అమ్మా అంటూ పెద్దగా అరుచుకుంటూ ఏడుస్తూ మెట్లు తిగుతాడు. అప్పుడే ఆ అరుపు వినిపించి, ఇంట్లో వాళ్ళు అంతా అక్కడికి వస్తారు. దేవి, చిన్మయి, రామ్మూర్తి, రాధ, భాగ్యమ్మ పడిపోయిన జానకీని చూసి షాక్ అవుతారు.

వెంటనే జానకీని హాస్పిటల్ కు తీసుకుని వెళ్తారు. పిల్లల్ని భాగ్యమ్మని ఇంట్లోనే వదిలేసి రాధ, మాధవ్ వెళ్తారు. ఇక రాధ అయితే, హాస్పిటల్లో డాక్టర్‌ని పిలుస్తూ జానకీ కోసం ఆరాటపడుతూ ఏడుస్తుంది. డాక్టర్స్ జానకీని లోపలికి తీసుకుని వెళ్తారు. అప్పుడే మాధవ చేతిలోని తాళి చూసుకుంటూ ‘నిజం తెలుసుకున్నందుకు మా అమ్మకు ఇలా జరిగింది. నాకు నువ్వు కావాలి రాధా. నేను నిన్ను ఎలా ఐనా దక్కించుకుంటాను. నీ విషయంలో ఎవరు అడ్డు పడినా వాళ్ళ పరిస్థితి ఇంతే అని చెబుతాడు.

ఇక సృహలోకి వచ్చిన జానకీ రాధా రాధ అని పిలుస్తుంటుంది. నర్స్ వెంటనే వచ్చి రాధకు చెబుతుంది. దానితో రాధ లోపలికి వెళ్తుంది. ఇక మాధవ మొహంలో టెన్షన్ కనిపిస్తుంది. రాధకు జానకీ నిజం చెప్పాలని చాలా ప్రయత్నం చేస్తుంది కానీ మాధవ తలుపు వెనుక నుంచి జానకీని చంపేస్తా అని బెదిరించడంతో మళ్లీ మత్తులోకి వెళ్లిపోతుంది జానకీ. దాంతో రాధకు నిజాలేమి చెప్పలేకపోతుంది. పైగా మూతి వంకరపోయి పక్షవాతం వస్తుంది. ఇదే నిజమైతే జానకీ ఇప్పట్లో మాట్లాడలేదు. తరువాత ఏమి జరగనుందో రేపటి ఏపిసోడులో తెలుకుందాం.

Exit mobile version