Site icon Prime9

BiggBoss Season6: బిగ్‌బాస్ హౌస్లో రేవంత్ రచ్చ… నేను మహా కన్నింగ్ అంటూ ఆట

bigg boss 6 17th day episode highlights

bigg boss 6 17th day episode highlights

BiggBoss Season6: బిగ్‌బాస్.. ఈ టీవీ షో దేశంలోని పలు భాషాల్లో నిర్విఘ్నంగా ప్రసారమవుతూ ప్రజల హృదయాలను కొల్లగొడుతుంది. కాగా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 అయితే తెలుగనాట బుల్లితెరను ఒక ఊపు ఊపేస్తుందనుకోండి. అయితే ప్రస్తుతం బిగ్‌బాస్ ఇంట్లో 17వ రోజు ఏం జరుగబోతుందో ఒకసారి చూసేద్దాం..

మీరు ముదురు అయితే నేను మహా ముదురు అన్న డైలాగ్ కు ధాటిగా మీరు కన్నింగ్ అయితే, నేను మహా కన్నింగ్… ఆడి చూపిస్తా అంటూ రేవంత్ బిగ్‌బాస్ ఆటను ఓ మలుపు తిప్పేలా కనిపిస్తున్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం ‘అడవిలో ఆట’ టాస్క్ కొనసాగుతుంది. ఇందులో హౌస్ మేట్లంతా పోలీసుల టీమ్, దొంగల టీమ్ గా విడిపోయి ఆడుతున్నారు. రేవంత్ దొంగల టీమ్. ఇక గీతూ అత్యాశ గల వ్యాపారిగా వ్యవహరిస్తోంది. అయితే దొంగలు కొట్టేసిన బొమ్మలు, వస్తువులు తెచ్చి గీతూకి అమ్ముతారనమాట. అయితే టాస్క్ లో భాగంగా రేవంత్ చాలా బొమ్మలను కొట్టేసి దాచి పెట్టాడు. వాటిలో కొన్నింటిని గీతూకి అమ్మాడు. మరికొన్నిబొమ్మలను వివిధ చోట్ల దాచిపెడతాడు కాగా వాటిని నేహా, ఆరోహి కలిసి దొంగిలిస్తారు. వీరు కూడా దొంగల టీమే కానీ టీమ్ అంతా కలిసి ఆడకపోవడం వల్ల వారిలోవారికి విభేదాలు వస్తున్నాయి. రేవంత్ తన బొమ్మలు ఎవరో కొట్టేశారని తెలిశాక అందరినీ అడిగుతాడు కానీ ఎవరూ సమాధానం చెప్పరు. గీతూ ‘నీ బొమ్మలు మీ వాళ్లే కొట్టేశారు, వాళ్ల గేమ్ వాళ్లు ఆడారు, అంత సీరియస్ అవ్వకు’ అంటుంది. ఇకపోతే బిగ్‌బాస్ చెప్పినట్టు కాకుండా గీతూ తనకిష్టమొచ్చిన గేమ్ రూల్స్ ని అతిక్రమిస్తూ నా ఆట నాఇష్టం అంటూ ఆడుతుంది.

దానికి రేవంత్ ఆలోచిస్తూ నిద్రపోదామనుకున్నా, కానీ నిద్రపోనూ, పోలీసుల టీమ్ ను ఎలాగైనా గెలిపిస్తా అంటుంటాడు. అంతేకాకుండా తన దగ్గరున్న కొన్ని వస్తువులు, బొమ్మలను పోలీసులకు ఇచ్చేసేందుకు ప్రయత్నిస్తాడు.. కానీ ఇవ్వడు. ఇక ఈ విషయం తెలిసిన సుదీప ‘నువ్వు టీమ్ మొత్తాన్ని డిస్ క్వాలిఫై చేస్తావా’ఏంటి అంటూ రేవంత్ ని కోప్పడుతుంది. కానీ రేవంత్ చివరికి వాళ్లటీంని గెలిపిస్తాడా లేదా పోలీసుల టీంని గెలిపించి మిగిలిన టీం సభ్యులతో గొడవకు దిగుతాడో తెలియదు. కానీ రేవంత్ కోపంలో ఎన్ని మాటలు అన్నా తన టీమ్ని ఓడిపోయేలా చేయడమే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

ఇదీ చదవండి: Bigg Boss Season 6: ఇనయానే టార్గెట్… శ్రీ సత్య ఆ మాట వెనుక దాగిన నిజం ఏంటి..?

Exit mobile version