Police Release Press Note About Kalpana Health: ప్రముఖ సింగర్ కల్పన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆమె ఆరోగ్యం నిలకడక ఉందని వైద్యులు ఆమె హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. అపస్మారక స్థితిలో కల్పన స్పృహలోకి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో కేపీహెచ్‌బీ పోలీసులు ఆమె స్టేట్‌మెంట్‌ను నమోదు చేసుకున్నారు. తాను ఆత్మహత్యాయత్నం చేయలేదని, తన కూతురితో ఉన్న మనస్పర్థల వల్ల తాను ఎక్కువ మోతాదులో స్లీపింగ్ పిల్స్ తీసుకున్నానని పోలీసులకు పోలీసులకు తెలిపారు.
ఆమె స్టేట్‌మెంట్ తీసుకున్న అనంతరం పోలీసులు ప్రెస్ నోట్ విడుదల చేశారు. పోలీసుల ప్రెస్‌నోట్ ప్రకారం.. “గత ఐదేళ్లుగా నటి గాయని కల్పన తన భర్తతో కలిసి నిజాంపేట్‌లోని ఓ విల్లాలో నివాసం ఉంటున్నారు. ఆమె కుమార్తె దయ ప్రసాద్‌కి, కల్పనకు మధ్య చదువు విషయంలో మనస్పర్థలు వచ్చాయి. ఈ విషయమై ఆమె భర్త ప్రసాద్ ఫోన్ చేయగా స్పందన లేదు. దీంతో ప్రసాద్ కాలనీ వెల్ఫెర్ సభ్యులకు ఫోన్ చేయడంతో వారు 100కి డయన్ చేసి సమాచారం ఇచ్చారు.
వారి సమాచారం మేరకు ఆమె ఇంటికి వెళ్లి తలుపులు తెరిచేందుకు ప్రయత్నించాను. ఫలితం లేకపోవడంతో వెనుక వైపు ఉన్న కిచెన్ డోర్ నుంచి లోపలికి వెళ్లాం. కల్పన తన బెడ్ రూంలో అపస్మార స్థితిలో ఉండటంతో ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించాం” అని చెప్పారు. ప్రస్తుతం కోలుకుంటున్న ఆమె తాను ఆత్మహత్యాయత్నం చేయలేదని చెప్పారు. ఈ ఘటనలో ఎవరి ప్రమేయం లేదని చెప్పినట్టు పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. కూతురితో జరిగిన గొడవ వల్ల నిద్ర పట్టక అధిక మోతాదులో నిద్ర మాత్రలు వేసుకోవడం వల్లే ఇలా జరిగిందని ఆమె చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు.