Prime9

Krishnaveni: ఇండస్ట్రీలో విషాదం – అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి కన్నుమూత

Senior Actress Krishnaveni Passes Away: అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి (102) కన్నుమూశారు. ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో ఆదివారం ఉదయయం ఆమె తుదిశ్వాస విడిచారు. కృష్ణవేణి వయసు ప్రస్తుతం 102 సంవత్సరాలు. వయోభారం సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆమె నేడు మృతి చెందారు. ఆమె మృతి సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్‌ మీడియాలో వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

సినీ పరిశ్రమకు ఆమె అందించి సేవలను గుర్తు చేసుకుంటు సంతాపం తెలియజేస్తున్నారు. మనదేశం సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఇందులో ఎన్టీఆర్‌తో కలిసి నటించడమే కాదు ఈ సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించారు. చెప్పాలంటే ఎన్టీఆర్‌ను సినిమా రంగానికి పరిచయం చేసింది ఆమె అని చెప్పాలి. సినీ రంగానికి ఆమె అందించిన సేవలకు గానూ రఘుపతి వెంకయ్య నాయడు పురస్కారం అందుకున్నారు. డిసెంబర్‌ 24, 1924 కృష్ణ జిల్లాలోని పంగిడిగూడంలో డా. ఎర్రంశెట్టి లక్ష్మణరావు, నాగరాజమ్మకు జన్మించారు కృష్ణవేణి.

చిన్నప్పటి నుంచి ఆమెకు నటన, నృత్యం అంటే ఆసక్తి. అదే ఇష్టంతో ఆమె సినిమాల్లోకి అడుగుపట్టారు. చిన్న వయసులోనే నాటకాలలో నటించడం మొదలుపట్టారు. ఆమె స్టేజ్‌ షో చూసిన దర్శకుడు సి. పుల్లయ్య తన చిత్రం సతీ అనసూయలో కృష్ణవేణిని బాలనటిగా తీసుకున్నారు. అలా 1936లో సినిమా రంగానికి పరిచయం చేశారు. ఆ తర్వాత బాల నటిగా కొనసాగుతూనే తెలుగు, తమిళ భాషాల్లో కథానాయికగా ఎదిగారు. అదే సమయంలో మీర్జాపురం జమీందార్‌తో ఆమె వివాహం జరిగింది.

Exit mobile version
Skip to toolbar