Site icon Prime9

Love Today Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ టుడే

love-today-to-stream-on-netflix-from-december-2

love-today-to-stream-on-netflix-from-december-2

Love Today Movie: ఈ తరం ప్రేమకథతో రూపొందించబడిన లవ్ టుడే సినిమా విజయవంతంగా థియేటర్లలో నడుస్తోంది. కాగా మూడు వారాల క్రితం తమిళంలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాకు ప్రదీప్‌ రంగనాథన్‌ నటిస్తూ, దర్శకత్వం వహించారు. కేవలం ఐదు కోట్ల బడ్జెత్‌తో నిర్మిత‌మైన లవ్ టుడే సినిమా తమిళంలో అర‌వై కోట్లకుపైగా వసూళ్లు రాబ‌ట్టింది. దీనితో ఈ సినిమాను అదే పేరుతో దిల్‌రాజు తెలుగులోకి డ‌బ్ చేశారు. గత శుక్రవారం (నవంబర్‌ 25న) థియేటర్లలో విడుదలైన ఈ రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌కు తెలుగునాట కూడా పాజిటివ్‌ టాక్‌ వచ్చింది.

ప్రేమకథకు కామెడీని జోడించి ఎంతో ఆసక్తికరంగా ఈ సినిమాను తీర్చిదిద్దాడు ప్రదీప్‌. ఈ చిత్రంలో ప్రదీప్‌కు జోడీగా ఇవానా, రవీనా రవి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో సత్యరాజ్‌, రాధికా, యోగిబాబు కీలకపాత్ర పోషించారు. యువన్‌ శంకర్‌ రాజా అందించిన పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఇదిలా ఉంటే థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోన్న లవ్‌టుడే సినిమా అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ లవ్‌టుడే డిజిటల్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. డిసెంబర్‌ 2న ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. త‌మిళంతో పాటు తెలుగు భాషల్లోనూ ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి నెట్‌ఫ్లిక్స్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా తెలుగులో విడుదలైన మొదటి రోజే ఈ సినిమా రూ. 2 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ఇదీ చదవండి: ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటా.. కృతిసనన్ క్లారిటీ

Exit mobile version