Site icon Prime9

NKR21: నందమూరి కళ్యాణ్ రామ్.. పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్నాడు.. ఇక దబిడిదిబిడే

NKR21: నందమూరి హీరోల్లో కళ్యాణ్ రామ్ ఒకడు. అతనొక్కడే అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఎచ్చయం కళ్యాణ్ రామ్.. విజయాపజయాలను పట్టించుకోకుండా వరుస సినిమాలను చేస్తూ వస్తున్నాడు.  ఇప్పటివరకు  కళ్యాణ్ రామ్ చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే.. బింబిసార సినిమా మరో ఎత్తు. అక్కడనుంచే అతని లైఫ్ టర్న్ అయ్యింది.

బింబిసార మంచి విజయాన్ని అందుకోవడంతో.. ఆ తరువాత కథలను ఆచితూచి ఎంచుకొని దానికి మించిన హిట్ అందుకోవడానికి నందమూరి హీరో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అమిగోస్, డెవిల్ లాంటి సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయినా.. నిరుత్సాహపడకుండా మరో మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

 

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం NKR 21. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సయీ మంజ్రేకర్ నటిస్తుండగా .. సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో నటిస్తోంది. సరిలేరు నీకెవ్వరూ తరువాత విజయశాంతి నటిస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. వీరే కాకుండా బాలీవుడ్ హీరో సోహైల్ ఖాన్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

 

Fauji Movie: ప్రభాస్ కు విలన్ గా మరో స్టార్ హీరో.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం.. ?

ఇక గత కొన్నిరోజుల నుంచి ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ రుద్ర అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే అది కేవలం రూమర్ మాత్రమే అని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు అర్జున్ సన్నాఫ్ వైజయంతీ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్. విజయశాంతి కెరీర్ లో వైజయంతీ సినిమా ఒక మైలురాయిగా మారింది. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ వైజాయతీగా విజయశాంతి నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇప్పుడు NKR 21 లో కూడా ఆమె అదే పాత్రలో నటించబోతుంది. ఆమె కొడుకు అర్జున్ గా కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు.

 

కళ్యాణ్ రామ్ ఇంతకు ముందెన్నడూ చేయని యాక్షన్ సీన్స్  ఇందులో ఉండబోతున్నాయట. అంతేకాకుండా తల్లీకొడుకుల మధ్య ఎమోషనల్ సీన్స్ మాత్రమే కాదు యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయట. ఒకపక్క విజయశాంతి.. ఇంకోపక్క కళ్యాణ్ రామ్ విలన్స్ తో కబడ్డీ ఆడుతుంటే.. దబిడిదిబిడే అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.  నిజం చెప్పాలంటే టైటిల్ తోనే సగం పాజిటివ్ వైబ్ తీసుకొచ్చేశారు.

 

విజయశాంతి పోలీస్ గా కనిపించడం  ప్రేక్షకులకు మరింత ఆనందాన్ని అందిస్తుంది. త్వరలోనే ఈ టైటిల్ ను అధికారికంగా ప్రకటిస్తూ చిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారట మేకర్స్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో నందమూరి హీరో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. 

Exit mobile version
Skip to toolbar