Prime9

Pawan Kalyan: భోజనం నచ్చకపోతే పవన్ అలా చేసేవాడు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన నాగబాబు

Pawan Kalyan: మెగా బ్రదర్స్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి తన స్వయంకృషితో సినిమాలోకి వచ్చి.. ఒక చిన్న విత్తనం నాటాడు. ఆ విత్తనామ ఇప్పుడు పెద్ద వృక్షంగా మారింది. చిరు తమ్ముళ్లుగా కొణిదెల నాగబాబు, కొణిదెల కళ్యాణ్ బాబు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. నాగబాబు నటనలో కన్నా నిర్మాణంలో ఎక్కువ ఫోకస్ చేశాడు. కళ్యాణ్ బాబు.. పవన్ కళ్యాణ్ గా మారి పవర్ స్టార్ గా ప్రేక్షకుల మదిలో దేవుడిగా వెలిశాడు. ప్రస్తుతం పవన్.. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

 

మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చాలా సైలెంట్. ఇంట్లో కూడా ఎప్పుడు ఏదో ఒక బుక్ చదువుతూ ఉంటాడు. చిన్నతనంలో  ఆయనకు ఎక్కువ డిప్రెషన్ ఉండేదని.. ఒకసారి అయితే ఆత్మహత్యకు కూడా పాల్పడినట్లు ఆయనే ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో ఆయనకు ఫ్రెండ్స్ తక్కువ. ఉన్నవారు మాత్రం ఎప్పుడు ఆయన పక్కనే ఉంటారు. ఇక చిన్నతనంలో పవన్ ఆహారపు అలవాట్లు గురించి ఒక ఇంటర్వ్యూలో నాగబాబు  చెప్పుకొచ్చాడు.

 

నేడు మహిళా దినోతస్వ సందర్భంగా మెగా తల్లి అంజనమ్మతో పాటు మెగా సిస్టర్స్ తో కలిసి చిరంజీవి, నాగబాబు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.ఇక ఈ ఇంటర్వ్యూలో తన తల్లి ఎక్కువగా ఎవరిని చూసుకొనేదే చెప్పుకొచ్చాడు. ” చిన్నతనం నుంచి నేనే ఎక్కువ అల్లరి చేసేవాడిని.  దెబ్బలు కూడా నాకే ఎక్కువ పడేవి. అన్నయ్య  ఎప్పుడు కష్టపడుతూనే ఉండేవాడు. ఇక భోజనం విషయంలో అమ్మ ఎప్పుడు పవన్ కళ్యాణ్ పైనే ఫోకస్ పెట్టేది. ఎందుకంటే వాడు సరిగ్గా తినేవాడు కాదు.

 

పవన్ ఏది తింటాడో తెలియదు. నచ్చకపోతే నేను అయితే.. అస్సలు తినేవాడిని కాదు. అమ్మకు చెప్పేసేవాడిని. నాకు నచ్చలేదు. నేను తినను అనేవాడిని. అన్నయ్య ఎలా ఉన్నా తినేవాడు. అడ్జస్ట్ అయ్యేవాడు. కానీ, పవన్ భోజనం నచ్చితేనే తినేవాడు. నచ్చకపోతే ఏం మాట్లాడకుండా వెళిపోయేవాడు. అమ్మ అడిగితే వద్దులేమ్మా తరువాత తింటా అనేవాడు. అదొక నిశబ్ద నిరసన ప్రకటించేవాడు. దాంతో వాడిని చాలా ప్రొటెక్ట్ గా చూసేది అమ్మ. అందులోనూ కళ్యాణ్ బాబు చిన్నప్పటి నుంచి వీక్ గా ఉండేవాడు. అందుకే అమ్మ వాడిమీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టేది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version
Skip to toolbar