Site icon Prime9

మెర్రీ క్రిస్మస్: కత్రినా కైఫ్ విజయ్ సేతుపతి జంటగా మెర్రీ క్రిస్మస్.. ఆసక్తికరంగా మూవీ ఫస్ట్ పోస్టర్

katrina kaif and vijay sethupathi merry Christmas movie poster release

katrina kaif and vijay sethupathi merry Christmas movie poster release

#MerryChristmas: బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ మరియు తమిళ హీరో విజయ్ సేతుపతి కలిసి నటిస్తున్న తాజా చిత్రం మెర్రీ క్రిస్మస్. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి మొదటి పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు చిత్ర బృందం. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తుండగా, టిప్స్ ఫిల్మ్స్ మరియు మ్యాచ్ బాక్స్ పిక్చర్స్ నిర్మించాయి.

ఈ మూవీని హిందీ మరియు తమిళంలో 2023లో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మూవీ టీం వెల్లడించింది. కాగా కైఫ్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఈ చిత్రం పోస్టర్‌ను ఆవిష్కరించారు. తాము ఈ చిత్రాన్ని ఈ క్రిస్మస్‌ కి విడుదల చేయాలనుకున్నామని కానీ ఒక ట్విస్ట్ ఉందని.. త్వరలో ఈ సినిమాతో థియేటర్లలో కలుద్దాం #MerryChristmas అంటూ కైఫ్ ఇన్ స్టా వేదికగా రాసుకొచ్చింది. సేతుపతి కూడా పోస్టర్‌ను షేర్ చేస్తూ, “#మెర్రీక్రిస్మస్ త్వరలో వస్తుంది” అని రాశారు. దీనికి పలువురు నెటిజన్లు స్పందిస్తూ “పోస్టర్ థ్రిల్లింగ్‌గా ఉంది, వేచి ఉండలేను! “అంటూ ఒకరు.. ఇది మీ ఉత్తమ చిత్రం అవుతుందంటూ మరొకరు..”ఈ కాంబో కోసం వేచి ఉండలేను!” అంటూ మరికొందరు పోస్టర్ కింద హార్ట్ ఎమోజీలతో కామెంట్లు రాసుకొచ్చారు. ఇక ఈ సినిమా కోసం బాలీవుడ్, కోలీవుడ్ అభిమానులు చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే కత్రినా కైఫ్ ఇటీవల సిద్ధాంత్ చతుర్వేది మరియు ఇషాన్ ఖట్టర్‌లతో కలిసి “ఫోన్ భూత్” చిత్రంలో నటించారు. ఆమె తదుపరి చిత్రం “టైగర్ 3” లో సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించనుంది. అలాగే సేతుపతి వెట్రిమారన్ యొక్క “విడుతలై”, షారూఖ్ ఖాన్ నటించిన “జవాన్” మరియు షాహిద్ కపూర్‌తో ప్రైమ్ వీడియో సిరీస్ “ఫర్జీ” లలో నటిస్తున్నారు.

ఇదీ చదవండి: కుర్రకారును ఉర్రూతలూగిస్తోన్న పూజాహెగ్డే.. జేమ్స్ బాండ్ హీరోయిన్ లుక్స్ తో టాలీవుడ్ బుట్టబొమ్మ

Exit mobile version