Site icon Prime9

Meenakshi Chaudhary: రాణిగారికి రాజుగారు భలే సర్ ప్రైజ్ ఇచ్చారే..

Meenakshi Chaudhary: మీనాక్షీ చౌదరీ.. ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఆమె కనిపిస్తుంది. ఇచట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో మీనాక్షీ తెలుగుతెరకు పరిచయమైంది. మొదటి సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా.. ఈ చిన్నదాని అందానికి మాత్రం ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఆ తరువాత రవితేజతో కలిసి ఖిలాడీ చేసింది. అది కూడా కలిసిరాలేదు. ఇక ఈ లోపే అమ్మడికి గుంటూరు కారం ఛాన్స్ వచ్చింది.

 

మహేష్ ఫ్యాన్స్ అందరూ ఆయన మీద ఫోకస్ చేస్తే.. మిగతావారందరూ మీనాక్షీ మీద ఫోకస్ చేశారు. సెకండ్ హీరోయిన్ గా అయినా.. ఆమె కోసం సినిమా చూడడానికి వెళ్ళినవారు లేకపోలేదు. అయితే సినిమా హిట్ అవ్వకపోయినా మీనాక్షీని మాత్రం స్టార్ గా మార్చింది గుంటూరు కారం. ఈ సినిమా తరువాత ఆమె సినిమాలు ఏమో కానీ.. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ మాత్రం గట్టిగా పెరిగారు. ఇక అమ్మడికి లక్ ఇచ్చిన సినిమా అంటే లక్కీ భాస్కర్.

 

సితార ఎంటర్ టైన్మెంట్స్ లో ఎప్పుడైతే అడుగుపెట్టిందో.. మీనాక్షీ లక్ పూర్తిగా మారిపోయింది. ఇక ఈ సినిమా తరువాత అమ్మడిని ఆపడం ఎవరివలన కాలేదు. మట్కా, ది గోట్ లాంటి సినిమాలు రిలీజ్ అయ్యి విజయాలను అందుకోలేకపోయినా.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా మీనాక్షీని కాస్తా మీనుగా మార్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో బిజీగా మారింది. మార్చి 5 న మీనాక్షీ పుట్టినరోజు. నిన్నటికి నిన్న మీనూ ఫ్యాన్స్ అందరూ ఆమెకు సర్ ప్రైజ్ ఇచ్చి ఆమెను ఎమోషనల్ అయ్యేలా చేశారు. ఇక ఈరోజు హీరో నవీన్ పోలిశెట్టి.. మీనూకు మరో సర్ ప్రైజ్ ఇచ్చాడు.

Nayanthara: ఇదెక్కడి విడ్డూరం.. నయన్ మొదటిసారి ఇలా.. అంతా అమ్మోరు తల్లి దయ

నవీన్ పోలిశెట్టి నటిస్తున్న తాజా చిత్రాల్లో అనగనగా ఒక రాజు సినిమా ఒకటి. ఇదేమి ఇప్పటి సినిమా కాదు. అనౌన్స్ చేసి రెండేళ్లు అవుతుంది. ఇప్పటివరకు దీనికి మోక్షం దక్కలేదు. మధ్యలో ఆగిపోయిన ఈ సినిమా ఈమధ్యనే  సెట్స్ మీదకు వెళ్ళింది. మొదట నవీన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా అనుకున్నారు. మధ్యలో శ్రీలీల స్టార్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు ఆమె ప్లేస్ లో మీనాక్షీ వచ్చి చేరింది. ఈ మధ్యనే నవీన్ సరసన మీనాక్షీ నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కూడా నాగవంశీనే నిర్మిస్తున్నాడు.

 

ఇక నేడు షూటింగ్ సెట్ లో మీనాక్షీ బర్త్ డే సెలబ్రేషన్స్ ను నవీన్ చాలా గ్రాండ్ గా నిర్వహించాడు. సెట్ లో ఉన్నవారందరి మధ్య మీనాక్షీతో కేక్ కట్ చేయించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు రాణిగారికి రాజుగారు భలే సర్ ప్రైజ్ ఇచ్చారే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో నవీన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Exit mobile version
Skip to toolbar