Site icon Prime9

Nayanthara: ఇదెక్కడి విడ్డూరం.. నయన్ మొదటిసారి ఇలా.. అంతా అమ్మోరు తల్లి దయ

Nayanthara: ఏంటీ.. నయనతార తన సినిమా పూజా కార్యక్రమానికి వచ్చిందా.. ? అని నోర్లు వెళ్లబెడుతున్నారు ఫ్యాన్స్. ఎందుకు అంత విడ్డూరం. హీరోయిన్ అన్నాకా సినిమా పూజా కార్యక్రమాల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు అన్నింటిలో పాల్గొనాలి కదా అని అంటారేమో.. అందరు ఒక ఎత్తు. లేడీ సూపర్ స్టార్ మరో ఎత్తు. ఈ చిన్నది తన సినిమా  అయినా కూడా ఒక పూజా కార్యక్రమానికి రాదు.. ఒక ప్రమోషన్ చేయదు.. ఒక ఇంటర్వ్యూ కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కానీ అసలు కనిపించదు. సినిమాకు సైన్ చేసేముందు ఆమె ఇవన్నీ ఓకే అనుకుంటూనే ఆ సినిమా చేస్తుంది. లేకపోతే నిర్మొహమాటంగా నో అనేస్తుంది.

 

ఇక నిర్మాతలు ఎంత బతిమిలాడినా.. ఇంకా ఎక్కువ డబ్బు ఇస్తామన్నా కూడా నయన్ అస్సలు వినదు. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలకు ప్రమోషన్స్ హీరోలు, డైరెక్టర్ చేస్తూ వచ్చారు. ఇక ఈ రూల్ ను బ్రేక్ చేసి మొదటిసారి తన సినిమా పూజా కార్యక్రమానికి వస్తే.. అందరు నోర్లు వెళ్లబెట్టక ఏం చేస్తారు. అందుకే ఇదెక్కడి విడ్డూరం అమ్మా అంటూ నెటిజన్స్ షాక్ కు గురవుతున్నారు. ఇక నయన్ వచ్చి మరీ పూజ చేసిన ఆ సినిమా ఏంటి అనేగా.. అదే అమ్మోరు తల్లి 2.

 

నయనతార ప్రధాన పాత్రలో ఆర్జే బాలాజీ, ఊర్వశీ కీలక పాత్రల్లో నటించిన చిత్రం అమ్మోరు తల్లి. RJ బాలాజీ, N J శరవణన్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా 2020 లో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. దేవతల పేర్లు చెప్పుకొని కొందరు బాబాలు జనాలను ఎలా మోసం చేస్తున్నారో.. ఇందులో చక్కగా వివరించారు. భక్తులను కాపాడే అమ్మోరు తల్లినే స్వయానా దిగివచ్చి.. మోసాన్ని బట్టబయలు చేయడం అనేది ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది.

Anurag Kashyap: హిందీ ఇండస్ట్రీ విషపూరితమైంది – అందుకే బాలీవుడ్‌ని వదిలేస్తున్నా, స్టార్‌ డైరెక్టర్‌

ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా అమ్మోరు తల్లి 2 మొదలయ్యింది. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు చెన్నైలో ఏర్పాటు చేసిన ఒక భారీ సెట్ లో ఘనంగా జరిగాయి. ఈ  పూజకే నయన్ అటెండ్ అయ్యింది. ఈ సినిమాకు ఖుష్బూ భర్త సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ పూజా కార్యక్రమానికి నయన్ మాత్రమే కాకుండా సీనియర్ నటీమణులు మీనా, ఖుష్బూ.. కుర్ర హీరోయిన్ రెజీనా సందడి చేశారు. మొదటిసారి నయన్.. అమ్మవారికి పూజ చేసి సినిమా షూటింగ్ ను మొదలుపెట్టింది.

 

ఇక ఈ సినిమా గురించి నిర్మాత గణేష్ మాట్లాడుతూ.. ” 30 రోజుల్లోనే డైరెక్టర్ సుందర్ ఈ కథను రెడీ చేశాడు. ఇప్పటివరకు ఇలాంటి కథను నేను వినలేదు. ఈ సినిమా కోసం నయన్ చాలా కష్టపడుతుంది. నెలరోజులు ఆమె ఉపవాసం ఉంటుంది. దాదాపు రూ. 100 కోట్లు ఖర్చుచేసి ఈ సినిమాను నిర్మిస్తున్నాను. ప్రస్తుతం షూటింగ్ మొదలైంది. త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది” అని చెప్పుకొచ్చాడు. ఏదిఏమైనా నయన్.. మొదటిసారి తన సినిమా ఫంక్షన్ కు వచ్చి సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. మరి ఈ సినిమాతో అమ్మడు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. 

Exit mobile version
Skip to toolbar