Site icon Prime9

Srikanth: రోజా.. రొమాన్స్ చేస్తూ కూడా అన్నా అని పిలిచేది

Srikanth: సీనియర్ హీరో శ్రీకాంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా గుర్తుచేయాల్సిన అవసరం లేదు. విలన్ గా కెరీర్ ను మొదలుపెట్టి.. హీరోగా మారి.. స్టార్ హీరోగా ఎదిగి.. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక రీఎంట్రీలో కూడా హీరోగా కాకుండా విలన్, సపోర్టివ్ రోల్స్ చేస్తూ మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్ సినిమాలో శ్రీకాంత్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా.. శ్రీకాంత్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

తాజాగా శ్రీకాంత్  బుల్లితెరపై ఒక షోలో పాల్గొన్నాడు. సీరియల్ కుటుంబాల మధ్య ఒక పోటీ పెడుతూ మొదలైన ఈ షోకి శ్రీకాంత్, సీనియర్ హీరోయిన్లు రాశీ, రోజా గెస్టులుగా విచ్చేశారు. అప్పట్లో శ్రీకాంత్- రాశీ, శ్రీకాంత్ – రోజా కాంబోకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇన్నేళ్ల తరువాత వారు ముగ్గురు ఒకే స్టేజిపై కనిపించడంతో ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ షో తరువాత శ్రీకాంత్.. రాశీ, రోజాల గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలను మరోసారి వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా రోజా తనను అన్న అని పిలవడం గురించి కూడా చెప్పుకొచ్చాడు. శ్రీకాంత్ సరసన రోజా రెండు సినిమాల్లో నటించింది. క్షేమంగా వెళ్లి లాభంగా రండి. తిరుమల తిరుపతి వెంకటేశా. రెండు  సినిమాలు సూపర్ హిట్స్.

Sonal Chauhan: బీచ్ ఒడ్డున బాలయ్య భామ.. అందాల విందు.. అదరగొట్టేసిందంతే

మొదటి నుంచి రోజా.. శ్రీకాంత్ ను అన్నయ్య అని పిలిచేది అంట. ఈ విషయాన్నీ రోజా చాలాసార్లు చెప్పుకొచ్చింది. ఇక బయట ఎలా ఉన్నా సెట్ లో మాత్రం క్యారెక్టర్స్ లో ఉండేవారట. అయితే రోజా మాత్రం సెట్ లో కూడా శ్రీకాంత్ ను అన్నయ్య అని పిలిచేదని, దానివలన ఆమెతో రొమాన్స్ చేసే ఫీలింగ్ వచ్చేది కాదని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.

“అప్పట్లో సౌందర్య, రాశీ, రమ్యకృష్ణ.. ఇలా వీరందరితో కలిసి నటించేవాడిని. చాలా మంచి ఆర్టిస్ట్ లు వాళ్ళందరూ. ఒక్క సినిమాతో సరిపెట్టేవారు కాదు. వరుసగా రెండు మూడు సినిమాలు చేసుకుంటూ పోయేవారు. ఒక ఫ్యామిలీలా అనిపించేస్తూ ఉండేది. అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ పోతూ ఉండేవారు. ఒక బాండింగ్ ఏర్పడింది వారందరితో. ఇప్పుడు వారిని మళ్లీ  కలిసినప్పుడు విచిత్రంగా ఉంటుంది. ఒకరు అన్నా అంటారు.. ఇంకొందరు వేరేలా పిలుస్తారు.

రోజా.. నన్ను అన్న అని పిలుస్తుంది. మేమిద్దరం కలిసి రెండు మూడు సినిమాలు చేసాం. సెట్ లో అన్నా.. అన్నా అంటుంది. షూటింగ్ జరిగేటప్పుడు ఓకే కానీ.. రొమాంటిక్ సాంగ్ జరిగేటప్పుడు కూడా అన్నా ఇలా చేద్దామా అని అడిగేది. ఏ  ఛీ ఆపు.. నువ్వు నన్ను కొద్దిసేపు అన్నా అని అనకు.. నాకు ఫీలింగ్ రావడం లేదు అని అనేవాడిని.. అలా ఇద్దరం నవ్వుకుంటూ సరదాగా చేసుకునేవాళ్లం” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version
Skip to toolbar