Game Changer Trailer Release Date: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ‘గేమ్ చేంజర్’జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, అంజలి, సునీల్, ప్రకాష్ రాజ్, జయరామ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ ఇప్పటికే సినిమాపై మంచి అంచనాను పెంచగా, ట్రైలర్‌ను నేటి సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ చేయనున్నారని మూవీ టీమ్ ప్రకటించింది. పనిలో పనిగా పంచెకట్టులో ఉన్న రామ్ చరణ్ పోస్టర్‌నూ షేర్ చేశారు.