Site icon Prime9

Veekshanam Teaser Released

Veekshanam Teaser Released: రామ్ కార్తీక్, క‌శ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘వీక్షణం’. ఈ చిత్రాన్ని ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తుండగా.. మ‌నోజ్ ప‌ల్లేటి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా, ఈ మూవీ టీజర్ ను దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతులమీదుగా విడుదల చేశారు. ఈ మూవీని అక్టోబర్ 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

‘వీక్షణం’ టీజర్ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడారు. వీక్షణం టీజర్ ఆసక్తికరంగా ఉందన్నారు. ఇందులో రామ్ కార్తీక్, క‌శ్వి హీరో హీరోయిన్లుగా చక్కగా నటించారన్నారు. దర్శకుడు మనోజ్ పల్లేటితో పాటు టీమ్ అందరికీ సినిమా సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు జెస్విన్ ప్రభు ఎడిటర్ గా పనిచేయగా.. ఆర్ట్ గా గాందీ నడికుడికర్, సినిమాటోగ్రపీగా సాయిరామ్ ఉదయ్, మ్యూజిక్ డైరెక్టర్ గా సమర్థ్ గొల్లపూడి వ్యవహరించారు.

అనంతరం నిర్మాత పి.పద్మనాభ రెడ్డి మాట్లాడారు. ముందుగా వీక్షణం సినిమా టీజర్ లాంఛ్ కు వచ్చిన తమ్మారెడ్డి భరద్వాజ గారికి కృతజ్ఞతలు తెలిపారు. టీజర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నా, కామెడీ మిస్టరీ ్రిల్లర్ గా వస్తున్న వీక్షణం సినిమా అందరినీ ఆకట్టుకుంటుందన్నారు.

రామానాయుడు ఫిల్మ్ స్కూల్ లో కోర్స్ చేశానని దర్శకుడు మనోజ్ పల్లేటి అన్నారు. ఒకరోజు విక్టరీ వెంకటేష్ ఒక మాట చెప్పారని గుర్తు చేశారు. ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏంటంటే మన పని మనం చూసుకోవడమని, ఆయన చెప్పిన ఆ మాటే మా వీక్షణం సినిమాకు కథా నేపథ్యం అన్నారు. టీజర్ లాంఛ్ రోజే చెబుతున్నా.. మేము తప్పకుండా సక్సెస్ మీట్ నిర్వహిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా హీరో రామ్ కార్తీక్ మాట్లాడారు. వీక్షణం మూవీకి సపోర్ట్ చేస్తూ వచ్చిన మీడియా మిత్రులకు థ్యాంక్స్ చెప్పారు. ఈ సినిమా టీమ్ లో సురేష్ కొండేటి జాయిన్ అయ్యాక కాన్ఫిడెన్స్ పెరిగిందన్నారు. మూవీ తప్పకుండా అందరికీ రీచ్ అవుతుందని నమ్మకం మొదలైందని, చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా తమ్మారెడ్డి భరద్వాజ మంచి మూవీకి తన సపోర్ట్ అందిస్తారన్నారు. సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నామన్నారు.

Exit mobile version