Game Changer Trailer Update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భారీ కటౌట్ రికార్డు క్రియేట్ చేసింది. ఆయన హీరోగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంతో తెరకెక్కిన మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ 2025 జనవరి 10న విడుదల కానుంది. ఆర్‌ఆర్‌ఆర్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చరణ్ నటిస్తున్న చిత్రమిది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆరేళ్ల తర్వాత సింగిల్‌గా వస్తుండటంతో గేమ్ ఛేంజర్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ సాధించాలని రామ్ చరణ్ భారీ కటౌట్‌ని ఏర్పాటు చేశారు.
విజయవాడలో రామ్ చరణ్ యువశక్తి అభిమానుల సంఘం 256 అడుగుల రామ్ చరణ్ (గేమ్ ఛేంజర్ లుక్) భారీ కటౌట్ నిర్మించారు. ఇది వరకు ఎప్పుడు లేని అత్యంత భారీ ఎత్తు కటౌట్‌ను చెన్నైకి చెందిన ప్రత్యేక బృందం దీనిని తయారు చేసింది. ఆదివారం ఈ కటౌట్‌ని నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించారు. తాజాగా ఈ భారీ కటౌట్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా దిల్ రాజుకు అవార్డును అందజేశారు. కాగా రామ్ చరణ్ యువశక్తి అధ్వర్యంలో బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో ఈ కటౌట్‌ని ఏర్పాటు చేశారు.
ఈ కటౌట్‌ను ఆవిష్కరించి సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ మూవీ ట్రైలర్ అప్‌డేట్‌తో పాటు రామ్ చరణ్ పర్ఫామెన్స్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. “గేమ్ ఛేంజర్ ట్రైలర్ నా ఫోన్‌లోనే ఉంది. మీ ముందుకు తీసుకు రావాలంటే ఇంకా కొంచెం వర్క్ చేయాల్సి ఉంది. ట్రైలర్ ఇప్పుడు సినిమా రేంజ్‌ని డిసైడ్ చేస్తుంది. జనవరి 1న మీరు ట్రైలర్ చూస్తారు. గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్ నట విశ్వరూపం చూస్తారు.
ఆయన కటౌట్ ఏర్పాటు చేసిన మెగా ఫ్యాన్స్ ధన్యవాదాలు” అని చెప్పారు. ఇక దిల్ రాజు ట్రైలర్ అప్‌డేట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. చరణ్ డ్యుమెల్ రోల్లో చేస్తున్న ఈ సినిమాలో తెలుగమ్మాయి అంజలి మరో ఫీమేల్ లీడ్ రోల్ పోషించింది. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్, సముద్రఖని తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.