Site icon Prime9

Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవిపై రూమర్స్‌ – నిజమేంతంటే!

Chiranjeevi Team Clarifies Rumours: మెగాస్టార్‌ చిరంజీవికి మరో అరుదైన గౌరవం అంటూ సోషల్‌ మీడియాలో ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. యూకే ప్రభుత్వం ఆయనకు యు.కె సిటిజన్‌ షిప్‌ ఇచ్చి గౌరవించిందని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ వార్తలపై ఆయన టీం స్పందించింది. ఇందులో ఎలాంటి నిజం లేదని, ప్రస్తుతం ఆయన ఇండియాలోనే ఉన్నట్టు స్పష్టం చేసింది.

కాగా చిరంజీవిని యుకెలో సన్మానించెందుకు అక్కడ ఓ కార్యక్రమాన్ని ప్లాన్‌ చేశారు. అయితే ఈ కార్యక్రమానికి కూడా ఆయన వెళ్లడం లేదట.  దుబాయ్ లో ఓ పెళ్లి సందర్భంగా ఇటీవల చిరు ఆయన సతీమణి సురేఖతో కలిసి దుబాయ్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. విమానంలోనే పెళ్లి రోజు వేడుక కూడా జరుపుకున్నారు. దుబాయ్ నుంచి ఇటీవల ఆయన తిరిగి వచ్చారు. ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక త్వరలోనే విశ్వంభర షూటింగ్‌లో పాల్గొననున్నారు.

Exit mobile version
Skip to toolbar