Fauji Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకప్పుడు ప్రభాస్ సినిమా కోసం రెండేళ్లు.. మూడేళ్లు వేచి చూడాల్సి వచ్చేది. కానీ, ఆదిపురుష్ తరువాత డార్లింగ్ ఫ్యాన్స్ కు ప్రామిస్ చేశాడు. ఏడాదిలో రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా చూసుకుంటాను అని.. ఆ మాట ప్రకారమే వరుస సినిమాలను లైన్లో పెట్టాడు.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి ది రాజాసాబ్. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ను ఫినిష్ చేసుకుంటుంది. ఈ సమ్మర్ లో కనుక రాజాసాబ్ రాకపోతే ఆగస్టులో రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక రెండోది ఫౌజీ. క్లాసిక్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ మధ్యనే పూజా కార్యక్రమాలను జరుపుకుంటుంది.
ఫౌజీలో ప్రభాస్ సరసన సోషల్ మీడియా బ్యూటీ ఇమాన్వి నటిస్తోంది. ప్రభాస్ సినిమాలు అంటే ప్రేక్షకుల్లో ఎన్ని అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డార్లింగ్ సినిమా నుంచి ఏ న్యూస్ వచ్చినా అది సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఫౌజీ సినిమాకు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం ఫౌజీలో ప్రభాస్ కు విలన్ గా హను బాలీవుడ్ హీరోను దింపినట్లు తెలుస్తోంది.
Shivaji Ganesan: నటుడు శివాజీ గణేశన్ ఇల్లు జప్తు – హైకోర్టు ఆదేశం
యానిమల్ తో బాబీ డియోల్ ఎంత ఫేమస్ అయ్యాడో అందరికీ తెల్సిందే. ఇక ఇప్పుడు అతని తమ్ముడు సన్నీ డియోల్ కూడా విలన్ గా కనిపించడానికి రెడీ అవుతున్నాడట. గదర్ 2 సినిమాతో మళ్లీ ఫార్మ్ లోకి వచ్చిన సన్నీ.. తెలుగులో జాట్ అనే సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న జాట్ ఏప్రిల్ 15 న రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇంకా ఈ సినిమా రిలీజ్ కాకముందే సన్నీకి ఫౌజీలో ఛాన్స్ వచ్చిందని టాక్.
ఫౌజీలో విలన్ చాలా స్టైలిష్ గా కనిపించాలంట. అంతేకాకుండా హీరో – విలన్ మధ్య హైలైట్ సీన్స్ ఉంటాయంట. అందుకే దానికోసం పాత విలన్స్ కాకుండా కొత్త ఫేస్ ను పెట్టాలని చూస్తున్నారని, సన్నీని చూసి హను.. ఫర్ఫెక్ట్ గా సరిపోతాడని అనుకోని ఆయనతో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.