Site icon Prime9

Anjali Anand: పెదాలపై ముద్దుపెట్టి.. తండ్రి ఇలాగే చేస్తాడు అన్నాడు

Anjali Anand: బాలీవుడ్ నటి అంజలి ఆనంద్ గురించి తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు. సీరియల్ నటిగా ఆమె కెరీర్ ను మొదలుపెట్టింది.  స్టార్ ప్లస్ యొక్క టెలివిజన్ షోలైన ధై కిలో ప్రేమ్, కుల్ఫీ కుమర్ర్ బజేవాలా వంటి ప్రధాన పాత్రల ద్వారా ఆమె ప్రసిద్ధి చెందింది. ఆ తరువాత కరణ్  జోహార్ దర్శకత్వం వహించిన కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ధర్మా ప్రొడక్షన్స్ చిత్రం రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీతో ఆమె హిందీ చిత్రరంగ ప్రవేశం చేసింది. అందులో కీలక పాత్రలో నటించి మెప్పించింది.

 

ఇక ఈ మధ్య నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ గా రిలీజ్ అయిన డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ లో షాహిదా పాత్రలో మెరిసి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న అంజలి.. తన చిన్నతనంలో తాను ఎదుర్కున్న లైంగిక వేధింపులను ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది. తండ్రి అని చెప్పుకొనే వ్యక్తినే తనను లైంగికంగా వేధించడాని తెలిపింది. అతను ఒక డ్యాన్స్ టీచర్ అని కూడా హింట్ ఇచ్చింది.

 

” నా ఎనిమిదేళ్ల వయస్సులో తండ్రిని కోల్పోయాను. ఆ ప్రేమ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఆ తరువాత నా జీవితంలోకి  తండ్రి అని ఒక వ్యక్తి వచ్చాడు. బలవంతంగా అతడిని మా కుటుంబం అంగీకరించాల్సి వచ్చింది. చిన్నతనంలో అతడు నన్ను ఏదో చేయాలనీ ప్రయత్నించాడు. ఆ వయస్సులో అతను ఏం చేస్తున్నాడో.. ? ఎందుకు చేస్తున్నాడో అర్ధం అయ్యేది కాదు. మొదట నన్ను హాగ్ చేసుకున్నాడు.. ఆ తరువాత నా పెదాలపై ముద్దుపెట్టాడు. తండ్రి అంటే ఇలాగే చేస్తాడు అని చెప్పాడు.

 

ఇక ఉన్నా కొద్దీ నన్ను కంట్రోల్ లోకి తీసుకోవడానికి ప్రయత్నించాడు. పొట్టి బట్టలు వేసుకోనిచ్చేవాడు కాదు. జుట్టు వదిలేయనిచ్చేవాడు కాదు. నా ఫ్రెండ్స్ ను కలవనిచ్చేవాడు  కాదు. ఆడపిల్లలు వేసుకొనే బట్టలు కాకుండా తన టీ షర్ట్ వేసుకోమనేవాడు. అతడిని నుంచి తప్పించుకోవడానికి నా మొదటి బాయ్ ఫ్రెండ్ సహాయం చేశాడు. అతడి వలనే నేను బయటపడ్డాను.

 

అసలైన ప్రేమ అంటే ఏంటో  నా మొదటి బాయ్ ఫ్రెండ్ వలనే తెల్సింది. కాకపోతే కొన్ని కారణాల వలన మేము విడిపోవాల్సి వచ్చింది. కానీ, అతనిని నేను లైఫ్ మొత్తం గుర్తుపెట్టుకుంటాను” అనిచెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version
Skip to toolbar