35 chinna katha kaadu: ఇటీవల చిన్న సినిమాలకు ప్రేక్షకాదరణ పెరుగుతోంది. కథ బాగుంటే చాలు చిన్న సినిమా అయిన పెద్ద హిట్ చేస్తున్నారు ఆడియన్స్. అలా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన చిత్రం ’35 చిన్న కథ కాదు’. హీరోయిన్ నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 6న థియేటర్లో విడులైంది. నందకిషోర్ ఇమాని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు హీరో రానా నిర్మాతగా వ్యవహరించారు. ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ బాగా ఆకట్టుకుంటుంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు అరుదైన ఘనత సొంతం చేసుకుంది.
ఈ సినిమాను ఇంటర్నేషనల్ ఫిలిం ఫేస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించనున్నారు. త్వరలోనే గోవాలో ఈ కార్యక్రమంలో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఇండియన్ పనోరమ ఈ సినిమాను ఎంపిక చేసినట్టు అధికారికంగా ప్రకటించింది. గోవాలోని పనాజీలో నవంబర్ 20 నుంచి 28 వరకు ఈ ఈవెంట్ జరగనుంది. ఇందులో మొత్తం 25 సినిమాలను ప్రదర్శించనున్నారు. దీనికి కోసం 384 సినిమాల ఎంట్రీ చేయగా.. అందులో తెలుగు నుంచి ’35 చిన్న కథ కాదు’ సినిమా ఎంపికైంది. ఈ విషయాన్ని తెలుపుతూ మూవీ టీం ఆనందం వ్యక్తం చేసింది. అంతేకాదు ఇది తెలుగు సినిమాకు గర్వకారణమంటూ తమ పోస్ట్‌లో పేర్కొంది.