15th Indian Memory Championship: ‘కష్టమైన సేల్స్‌ని సులభ‌తరం చెయడమే లక్ష్యం’

15th Indian Memory Championship: 15వ ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్‌షిప్‌ను స్క్వాడ్రన్ లీడర్ జయసింహ నేతృత్వంలోని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్, వైరల్‌పే స్పాన్సర్లగా వ్యవహరించారు. దీనిలో  3 దేశాలు, 13 రాష్ట్రాలు, 59 నగరాలు,  74 పాఠశాలల నుండి 180 మంది పాల్గొంటున్నారని, ఇందులో 10 మందికి పైగా 60 ఏళ్లు పైబడిన వారు పాల్గొన్నారని డాక్టర్ పి శ్రీనివాస్ కుమార్ మీడియాకు తెలిపారు. హైదర్‌నగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి 5 మంది విద్యార్థులు, ASWA ఫౌండేషన్ నుండి 5 మంది విద్యార్థులు పాల్గొనడం విశేషమన్నారు.

ఈవెంట్ స్పాన్సర్‌గా ముందుకు వచ్చిన వైరల్‌పే చైర్మన్ పీఆర్ మాట్లాడుతూ బిజినెస్‌కి చాలా కష్టమైన సేల్స్‌ని సులభ‌తరం చెయ్యడానికి ఎలాగైతే వైరల్‌పే సేల్స్ అండ్ సర్వీసెస్  తీసుకురాబోతున్నామో, అలాగే చదివింది చాలా సులభతరంగా గుర్తుండడానికి ఈ మెమోరీ టెక్నిక్స్ చాలా సహాయపడతాయని, విద్యార్థులందరికీ ఈ టెక్నిక్స్‌ని చేరవేయాలనే శ్రీనివాస్ కుమార్ ఆలోచన, దేశంలోని ప్రతి మూలకు ఈ నైపుణ్యాన్ని తీసుకురావాలనే అతని విజన్ మాకు నచ్చి ఈ ఈవెంట్‌ను స్పాన్సర్ చేయాలని నిర్ణయించుకున్నాము.  అతని భవిష్యత్ ప్రయత్నాలన్నిటికీ మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాము అని తెలిపారు.

నటుడు, జాతీయ శిక్షకుడు ప్రదీప్ ఛాంపియన్‌షిప్‌లో ప్రదర్శనతో సంబంధం లేకుండా, జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడం ప్రతి పాల్గొనేవారిలో విశ్వాసాన్ని పెంపొందిస్తుందని ఉద్ఘాటించారు. ఈ ఆత్మవిశ్వాసం ఎవరినైనా జీవితంలో ఉన్నత శిఖరాలకు చేర్చగలదని ఆయన పేర్కొన్నారు.

జేఎన్‌టీయూహెచ్ బయోటెక్నాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఉమా మాట్లాడుతూ.. చాలా ఛాంపియన్‌షిప్‌లు నిర్దిష్ట వయస్సు నుండి పాల్గొనేవారిని ఆకర్షిస్తాయి. అయితే ఈ మెమరీ ఛాంపియన్‌షిప్‌లో అన్ని వయసుల వారు ఉత్సాహంగా పోటీపడడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఉపాధ్యాయురాలిగా తాను ఈ టెక్నిక్‌లకు మనస్పూర్తిగా మద్దతిస్తున్నానని డాక్టర్ ఉమ వ్యక్తం చేశారు.

డాక్టర్ జయ ప్రకాష్ నారాయణ రిటైర్డ్ ఐఏఎస్ మాట్లాడుతూ పతకం అందుకున్నా లేదా అనే దానితో సంబంధం లేకుండా పాల్గొనే వారందరూ విజేతలని తెలిపారు. ఈ రకమైన ఈవెంట్‌ను స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చినందుకు వైరల్‌పే వ్యవస్థాపకుడు, ఛైర్మన్, శ్రీ పి ఆర్ శ్రీనివాసన్, కో-ఫౌండర్, సిఎఫ్‌ఓ, శ్రీమతి శ్రీవల్లి పేపకాయల, సహ వ్యవస్థాపకుడు మేనేజింగ్ డైరెక్టర్ షాజీ కె ఆర్ పట్ల ఆయన వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్పీడ్‌ రీడింగ్‌, మైండ్‌ మ్యాపింగ్‌లో భారత్‌ నుంచి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన రజనీష్‌ బారాపాత్రేకు ట్రోఫీని అందించారు.