Site icon Prime9

Weekly Horoscope: వార ఫలాలు.. ఈ వారం రాశి ఫలాలు( మార్చి 9 నుండి మార్చి 15 వరకు) ఎలా ఉన్నాయంటే?

Weekly Horoscope in Telugu, 2025 March 9 to March 15: వార ఫలాలు. ఈ వారం మార్చి 9 నుండి మార్చి 15 వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం: మేష రాశి వారికి ఈ వారం అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు. చేపట్టిన ప్రతి పనిలోనూ ఆటంకం లేకుండా విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలోనూ మంచి పురోగతి బాగుంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉన్నత ఉద్యోగ పదవీ లభిస్తుంది. ప్రభుత్వ సంబంధమైన లీజులు కాంట్రాక్టులు మంజూరు అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి కాలంగా చెప్పవచ్చు. ఇంక్రిమెంట్లు గానీ ఉద్యోగంలో ప్రమోషన్స్ గాని వచ్చే అవకాశాలు ఉన్నాయి. పై అధికారుల మెప్పును పొందగలుగుతారు. కళా రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి వీరందరికీ కూడా కాలం అనుకూలంగా ఉంది. నూతన వ్యాపారం ప్రారంభించాలని ఆలోచన చేస్తారు. నలుగురి సలహాలు సూచనలు తీసుకొని వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. భాగస్వాములతో కాకుండా మీకు మీరుగా సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించు కుంటారు ఇది మంచి నిర్ణయం అవుతుంది. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఒత్తిడికి లోను కాకుండా చదువుకోవడం అనేది చెప్పదగిన విషయం. పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తే పట్టు వదలని విక్రమార్కుడిలా దానిని పూర్తిచేస్తారు. నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. విదేశీ సంబంధమైన వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో స్థానం మార్పు ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు వచ్చిన ఉద్యోగ అవకాశాల్ని చేజార్చుకోకుండా ఆచితూచి నిర్ణయం తీసుకోండి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. నూతన గృహ నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతాయి. భూమికి సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. అమ్మకాలు కొనుగోలులో లాభాలు పొందుతారు. ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. సంతాన పురోగతి బాగుంటుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశి వారు ప్రతిరోజు కూడా శని గ్రహ స్తోత్రాన్ని పఠించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసే వచ్చే సంఖ్యా 6 కలిసివచ్చే రంగు గ్రీన్.

వృషభం: వృషభ రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ వ్యవహార శైలిలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ఇబ్బంది లేనటువంటి వాతావరణం నెలకొంటుంది. సహోద్యోగులు మీకు ఎంతగానో సహాయం చేస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించే అవకాశం గా చెప్పవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా లాభసాటిగా ఉన్న ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. చేసే పనిలో లాభనష్టాలు చూసుకోకుండా ధనాన్ని ఖర్చు చేస్తారు. ధనాన్ని పొదుపు చేయడం పైన దృష్టి పెడతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా బాగున్నప్పటికీ ఆరోగ్యపారంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. దైవానుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమే అని కాలం మరోసారి రుజువు చేస్తుంది. చట్టపరమైన చిక్కుల నుండి బయటపడతారు. మితిమీరిన ఆత్మవిశ్వాసం నమ్మకం మీకు నష్టం కలిగిస్తాయి. కొంతమంది విషయంలో పెళ్లి చేదు అనుభవంగా మారుతుంది. ఉద్యోగ పరంగా మంచి అవకాశం రావడం వల్ల వేరే కంపెనీకి మారుతారు. ముఖ్యమైన బాధ్యతలు అధికారాలు మీ చేతికి అప్పగించబడుతాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణ ఏర్పరచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ సంబంధాన్ని కుదుర్చుకునేటప్పుడు అన్ని విషయాలు తెలుసుకుని, నలుగురితో చర్చించి, ఆ సంబంధం గురించి ఎంక్వయిరీ చేసి ముందుకు వెళ్లడం అనేది చెప్పదగిన సూచన. క్రయవిక్రయాలు లాబిస్తాయి. నూతన గృహం కొనుగోలుకు సంబంధించి బ్యాంకు లోన్లు మంజూరు అవుతాయి. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అంతా అనుకూలంగా లేదు. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి అలాగే శివ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవండి దీనివలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా ఐదు కలిసి వచ్చే రంగు గ్రే.

మిథునం: మిథున రాశి వారికి ఈ వారం అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు. ఏ పని చేసినా మీదే పైచేయిగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలపరంగా లాభసాటిగా ఉంటుంది. వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకోగలుగుతారు.స్థలాలు కానీ బంగారం కానీ కొనుగోలు చేస్తారు. కొన్ని విషయాలను రహస్యంగా ఉంచుతారు. ఉద్యోగం మారాలని ఆలోచన చేస్తారు. వ్యాపార పరంగా వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. సంతాన పురోగతి బాగుంటుంది. సంతానం కోసం ధనాన్ని విశేషంగా ఖర్చు చేస్తారు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు రియల్ ఎస్టేట్ వస్త్ర వ్యాపారం ఎరువుల వ్యాపారం లాభాల బాటలో ఉంటాయి. ధైర్యం చేసి నూతన వ్యాపారం ప్రారంభిస్తారు అది కూడా లాభాలలో నడుస్తుంది విద్యాసంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కీలక విషయాలలో న్యాయ నిపుణుల సలహాలు అవసరం అవుతాయి. సివిల్ కేసులకు సంబంధించిన ఇబ్బందులను అధిగమిస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. విద్యార్థిని విద్యార్థులు బద్దకాన్ని విడిచి చదువు పైన దృష్టి సారించాలి. మీరు సహాయం చేసిన వారే వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. ప్రభుత్వపరంగా రావాల్సిన ధనం చేతికి అందుతుంది. రాజకీయరంగంలో ఉన్న వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రతిరోజు మహాలక్ష్మి అమ్మవారికి లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యా 2, కలిసి వచ్చే రంగు తెలుపు.

కర్కాటకం : కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. విదేశీ ప్రయాణాలు చేస్తారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. సోదరులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వ్యాపారంలో రొటేషన్ బాగుంటాయి. నూతన వ్యాపారం ప్రారంభించాలని ప్రయత్నం చేస్తారు. భాగస్వామి యొక్క సలహాలు సూచనలు తీసుకోకుండా ముందుకు వెళ్లడం జరుగుతుంది. దాని వల్ల కొన్ని నష్టాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. వాహన
యోగం ఏర్పడుతుంది. సినిమా రంగాల్లోని వారికి టీవీ రంగంలోని వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు మంచి నూతన అవకాశాలు లభిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సానుకూల పడతాయి. ప్రతి విషయంలోనూ స్త్రీల సహాయ సహకారం మీకు లభిస్తుంది. కొనుగోలు అమ్మకాల విషయంలో మధ్యవర్తుల మాట వినకుండా స్వయంగా వాస్తవాలు పరిశీలించి నిర్ణయాలు తీసుకోండి. జీవిత భాగస్వామి పేరుమీద చేసే వ్యాపారం బాగుంటుంది. సంతానం లేని వారికి సంతానం విషయంలో ఈ వారం శుభవార్త వింటారు. బంధువులతో అభిప్రాయ బేధాలు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. చెప్పుడు మాటలు విని పొరపాటు నిర్ణయాలు తీసుకొని కొన్ని విషయాలలో నష్టపోతారు. కీళ్ల నొప్పులు గైనకాలజీ ప్రాబ్లం ఇబ్బంది పెట్టి అవకాశం ఉంది. చిట్టీలు కట్టి మోసపోయే అవకాశం ఉంది, దయచేసి స్కీములకు దూరంగా ఉండండి. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా, వ్యాపార పరంగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నలుగురిలో మీకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ప్రతిరోజు నిత్యం ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. మీ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 8, కలిసివచ్చే రంగు నేవీ బ్లూ.

సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం ముఖ్యమైన విషయాలు బాగున్నాయి. ఎప్పటినుండో జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు ఈ వారం పరిష్కారం అవుతాయి. వివాహాది శుభకార్యాలు ముడి పడతాయి. వ్యాపార పరంగా నష్టాలు తక్కువగా లాభాలు ఎక్కువగా ఉంటాయి. అప్పులు ఇవ్వడం తీసుకోవడం రెండూ కలిసి రావు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్థానచలనం కనిపిస్తుంది. నీకు వచ్చిన అవకాశం మంచిదా కాదా అని ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. ముఖ్యమైన విషయాలు ఎన్నో ఈ వారం పరిష్కారం అవుతాయి. విద్యాసంబంధమైన విషయాలు అన్ని రంగాలకు సంబంధించి బాగున్నాయి. విదేశాలకు వెళ్లి చదువుకోవడానికి అవకాశాలు కలిసి వస్తాయి. సాంకేతిక విద్యలో అత్యున్నత స్థానం అధిరోహిస్తారు. ఉద్యోగం లేని వారికి గొప్ప అవకాశం కలిసి వస్తుంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి డాక్టర్స్ కి లాయర్స్ కి చార్టెడ్ అకౌంట్ వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రభుత్వపరంగా కొన్ని మంచి ఆర్డర్స్ పొందగలుగుతారు. కాంట్రాక్టులు సబ్ కాంట్రాక్టులు లీజులు అనుకూలిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయం పారాయణ చేయండి. కరుంగలి మాల మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు.

కన్య: కన్యా రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఏ విషయంలో అయినా సరే మీరు తీసుకున్న నిర్ణయాలను అమలు చేస్తారు. ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ దానిని అధిగమించి మీ శక్తితో ఎన్నో పనులు చేయగలుగుతారు. కెరియర్ మీద దృష్టి పెడతారు. అపార్ట్మెంట్ కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. చెప్పుడు మాటలు విని నిర్ణయాలు తీసుకోకుండా నిజా నిజాలను ప్రత్యక్షంగా గ్రహించి నిర్ణయం తీసుకోండి. పాల ఉత్పత్తులకు సంబంధించి లాభాలు బాగుంటాయి. పాలు నీళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్, ఆహార సంబంధిత వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంది. విద్యార్థిని విద్యార్థులకు స్వల్పంగా ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది చదువు పైన శ్రద్ధ వహించండి. గణపతి స్వామి వారికి గరికతో గకారక అష్టోత్తరంతో పూజ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. బద్ధకాన్ని వీడితే ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు. హాస్టల్స్ నిర్వహించే వారికి కాలం అనుకూలంగా లేదు. హాస్టల్ మూసివేసి ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తారు. విద్యార్థిని విద్యార్థులు మేదో దక్షిణామూర్తి రూపును మెడలో ధరించండి మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ఓం నమో శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసివచ్చే రంగు తెలుపు.

తుల: తులా రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా చిన్నచిన్న ఆటంకాలు ఎదురవుతాయి. వచ్చిన అవకాశాలను చేజార్చు కోవద్దు. ఆరోగ్యపరంగా కూడా చిన్నచిన్న ఇబ్బందులు ఏర్పడి పరిస్థితి గోచరిస్తుంది. వ్యాపారపరంగా అంతంతమాత్రంగా ఉంటుంది మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించదు. ఈవారం ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్యాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శుభకార్యం చేయాలనుకున్నప్పుడు సమయానికి డబ్బు సర్దుబాటు కాదు. కొంత అప్పు చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. లోన్ల విషయంలో క్రెడిట్ కార్డుల విషయంలో జాగ్రత్త వహించాలి. నర దిష్టి అధికంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో మీరు ప్రారంభించిన వ్యాపారం బాగుంటుంది. ప్రతి విషయాన్ని కొత్త కోణంలో ఆలోచిస్తారు. ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి ప్రజల అభివృద్ధి తెలుసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. రాజకీయపరంగా మంచి ఆదరణ లభిస్తుంది. భాగస్వాములను కలుపుకుని వ్యాపార విస్తరణ చేస్తారు. సామాజిక సేవా సంస్థలకు అన్నదానానికి గో సంరక్షణకు విరాళాలు ఇస్తారు. ఉద్యోగ పరంగా మీ స్థాయి పెరుగుతుంది. విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారికి సుబ్రమణ్య స్వామి వారికి అభిషేకం చేయించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 9 కలిసి వచ్చే రంగు బ్లూ కలర్.

వృశ్చికం: వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార ప్రాప్తి, ఏ పని చేసినా ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్లడం, నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం ఇవన్నీ కూడా సంభవిస్తాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని భావిస్తారు. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే వారికి విదేశీ విద్య లభిస్తుంది. పోటీ పరీక్షలలో ఇంటర్వ్యూలలో మీ సామర్ధ్యాన్ని రుజువు చేసుకొని మంచి ఉద్యోగం సంపాదిస్తారు. దగ్గరగా వచ్చి దూరంగా వెళ్లిపోతున్న పెళ్లి సంబంధాల విషయంలో మానసిక వేదన కలుగుతుంది. అన్ని సమస్యలను కాలమే పరిష్కరిస్తుందని ధైర్యంగా ఉంటారు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. యోగా మెడిటేషన్ చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. మీ ప్రమేయం లేకుండానే బంధు వర్గంతో విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకం చదవండి కాలభైరవ రూపును మెడలో ధరించడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు స్కై బ్లూ.

ధనస్సు: ధనస్సు రాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి అర్థాష్టమ శని ప్రారంభం కాబోతుంది ఈ అర్ధాష్టమ శని వలన కొంతమందికి మంచి జరుగుతుంది కొంతమందికి చెడు జరుగుతుంది. అది వారి జాతకం ప్రకారం ఉంటుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వ సంబంధమైన అవార్డులు రివార్డులు లభిస్తాయి. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. అప్పులకి క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండండి. బంగారం కానీ వెండి వస్తువుల భద్రతా విషయంలో జాగ్రత్త చాలా అవసరం. క్రెడిట్ కార్డులు లోన్ యాప్ ల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. పోటీ పరీక్షలలో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు. మీరు అనుకున్న పనులు సమయానికి కాస్త అటు ఇటుగా పూర్తవుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు తెలుపు.

మకరం: ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వచ్చిన అవకాశాలను వదులుకోకుండా ముందుకు వెళ్లడం అనేది చెప్పదగిన సూచన. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. రాజకీయమైన పదవులు లభించే అవకాశం ఉంది. సంతాన పురోగతి బాగుంటుంది. కాంట్రాక్టులు సబ్ కాంట్రాక్టులు లీజులు మొదలైనవి అనుకూలిస్తాయి. విదేశాలలో చదువుకునే అవకాశం, ఉద్యోగం చేసే అవకాశం లభిస్తాయి. ప్రజలలో మంచి ప్రఖ్యాతిని ఏర్పరచుకోగలుగుతారు. పాత రుణాలు తీర్చివేస్తారు. విద్యా సంబంధమైన విషయాలు బాగున్నాయి. వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి సంబంధం కుదురుతుంది. వివాహ పొంతనాలు చూసుకుని ముందుకు వెళ్ళండి. ఏదైనా నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునేటప్పుడు శివునికి అభిషేకం చేయించి ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి. మీ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించినవారు ప్రతిరోజు ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా 3 కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ..

కుంభం: కుంభ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వ్యాపారంలో మీ స్వశక్తితో ఎదగడానికి ప్రయత్నం చేస్తారు. బంధువులలో ఏర్పడిన విభేదాలు సమసిపోతాయి. కుటుంబ పురోగతి బాగుంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి నిలకడ కలిగిన ఉద్యోగం లభిస్తుంది. సంతానాన్ని చదువు కోసం విదేశాలకు పంపే ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకు రుణాలు లభిస్తాయి. స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. సాధ్యమైనంతవరకు అప్పులు తీర్చే ప్రయత్నం చేయండి. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాలు ఆర్థిక పరిస్థితి వల్ల కొంత ఆలస్యం అవుతాయి. జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు ఏర్పడతాయి. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు కొంతమంది నిరాశకు గురవుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కలిసి బాటు ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా 2, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ.

మీనం: మీనరాశి వారికి ఈ వారం జన్మ రాశిలో శుక్ర రాహువుల కలయిక వల్ల ఏదైనా పని చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి అఘోర పాశుపత హోమం చేయించండి. విదేశీ వ్యవహారాలు కోర్టు వ్యవహారాలు కొంతమేరకు అనుకూలంగా ఉంటాయి. అనుకున్న వాటిని ఏదో రకంగా సాధిస్తారు పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు. దైవదర్శనాలు చేసుకుంటారు. కుటుంబ పరిస్థితి పురోగమనంలో ఉంటుంది. వృత్తి ఉద్యోగులపరంగా వ్యాపార పరంగా కొంత అభివృద్ధి అనేది కనిపిస్తుంది. రావలసిన బాకీలు వసూలు అవుతాయి. విలువైన ఆభరణాలను వస్తువులను కొనుగోలు చేస్తారు ఆకస్మిక ధన ప్రాప్తి లభిస్తుంది. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. బ్యూటీ పార్లర్ నడిపే వారికి అలంకార సామాగ్రి అమ్మే వారికి చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారికి లాభాలు అధికంగా ఉన్నాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. విదేశాలలో చదువుకోవడానికి అవకాశాలు కలిసి వస్తాయి. శుభకార్యాలకు సంబంధించి బరువు బాధ్యతలను దించుకుంటారు. రాజకీయపరమైన పదవులు లభిస్తాయి. సాంస్కృతిక కళా రంగాలలో మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. నూతన వ్యాపారం ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం కాదు ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలోనే ముందుకు సాగండి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. సొంత నిర్ణయాల వలన నష్టపోతారు. జనాకర్షణ కోసం ధనాకర్షణ కోసం కరుంగలి మాలను మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికే కలసి వచ్చే సంఖ్యా ఎనిమిది కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ.

Exit mobile version
Skip to toolbar