Site icon Prime9

Vastu Tips : భార్యాభర్తల మధ్య గొడవలకు ఈ వాస్తు టిప్స్ తో చెక్ పెట్టొచ్చు?

vastu tips to solve problems between wife and husband

vastu tips to solve problems between wife and husband

Vastu Tips : భార్యాభర్తల బంధం అనేది ఎంతో అన్యోన్యమయింది. కలకలం సంతోషంగా కలిసి ఉండాలని కోరుకుంటూ మూడు ముళ్ళ బంధంతో ఒక్కటి చేస్తారు. అయితే పెళ్లి తర్వాత ఆలుమగల మధ్య చిన్న చిన్న గోడవలు రావడం సహజమే. గొడవలు పడని భార్యాభర్తలు ఉంటారు అంటే ఆశ్చర్యం అనే చెప్పాలి. అయితే చిన్న చిన్న గొడవలు అనేవి రావడం సహజమే కానీ అవి… చిన్న తుంపర్లు చిలికి చిలికి గాలివానగా మారినట్లు మాత్రం మారకూడదు. ఎన్ని మనస్పర్ధలు వచ్చిన, గొడవలు వచ్చిన కానీ ఒకరిని ఒకరు అర్దం చేసుకుంటూ కలిసి బ్రతికేదే కాపురం. అందుకే పెద్దలు కూడా నూరేళ్ళ బంధాన్ని చిన్న విషయాలకు ఎప్పుడు తెంచుకోకండి అని చెబుతుంటారు.

అయితే హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారమే ఇంటి నిర్మాణం చేపట్టాలని పెద్దలు చెబుతుంటారు. మన ఇంట్లో చేసే కొన్ని వాస్తు లోపాల కారణంగా ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించే ప్రమాదం ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాంటి సమయంలో మీ ఇంట్లో గొడవలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా తీసుకోవాల్సిన కొన్ని వాస్తు చిట్కాలు మీకోసం ప్రత్యేకంగా…

బెడ్ రూమ్ కలర్స్…

వాస్తు ప్రకారం, వివాహ బంధంలో ఉండే వారి ఇంట్లోని గోడలపై ఈశాన్య ప్రాంతంలో నీలం లేదా పర్పుల్ రంగులు ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు ఆ ప్రదేశంలో సూర్యకాంతి స్పష్టంగా పడేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

ఒకే బెడ్..

వాస్తు శాస్త్రం ప్రకారం, భార్యభర్తలు పడకగదిలో మెటల్ బెడ్ లపై పడుకోకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఈ రకంగా పడుకోవడం వల్ల వారి నిద్రకి ఆటంకం కలిగి ఆ తర్వాత వారి మధ్య గోడవలకు కూడా కారణం అవుతుంది అని అంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరు ఒకే బెడ్ షీట్ కప్పుకొని పడుకుంటే ఇంకా మంచిదని చెప్తున్నారు.

దుప్పట్ల రంగులు…

భార్యాభర్తల బెడ్ రూమ్ లో బెడ్ షీట్స్ లేదా దుప్పట్లు పింక్ లేదా రెడ్ కలర్లో ఉండేలా చూసుకోవాలి. ఇలా ఉంటే వారి మధ్య గొడవలు తలెత్తవని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version