Vastu Tips : పురాణాలు, శాస్త్రాల ప్రకారం తులసి మొక్కకి హిందూ సంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీదేవికి ప్రతిరూపంలా తులసి మొక్కను భావించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక హిందూ మహిళలు ఉదయాన్నే లేచిన తర్వాత ఇంట్లోని తులసి మొక్కకు పూజ చేయడం గమనించవచ్చు. అయితే తులసి మొక్కను తాకడానికి, మొక్కను నాటడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అవేంటో మీకోసం ప్రత్యేకంగా…
తులసి మొక్కను ఎక్కడ నాటాలి :
వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కలను ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో నాటితే మంచిదని చెబుతున్నారు.
ఈ దిక్కుల్లో దేవతలు కొలువై ఉంటారని భావిస్తారు.
ఇంటి బాల్కనీ లేదా కిటికీలో తులసి మొక్కలను నాటవచ్చు.
అలానే పరిశుభ్రమైన ప్రదేశాలలో మాత్రమే తులసి మొక్కను నాటాలి.
తులసి చెట్టును ఏ దిశలో ఉంచకూడదు :
తులసి చెట్టును దక్షిణ దిశలో ఉంచకూడదు.
ఎందుకంటే ఆ దిక్కులో తులసి మొక్క ఉండడం అపవిత్రంగా భావిస్తారు.
ఒకవేళ అనుకోకుండా లేదా తెలియకుండా ఇలా చేసినట్లయితే మార్చాలని సూచిస్తున్నారు.
దీని ఫలితంగా, ఇంట్లో పేదరికం. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయని అంటున్నారు.
తులసి మొక్కను తాకేటప్పుడు పాటించాల్సిన నియమాలు :
స్నానం చేయకుండా తులసి మొక్కను తాకకూడదు.
మురికి చేతులతో తులసిని తాకకూడదు.
సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కను తాకకూడదు.
గురువారం నాడు మాత్రమే తులసి మొక్కను తీసుకురావాలి.
తులసి మొక్కను ప్లాస్టిక్ కుండీలో నాటడం మంచిది కాదని వాస్తు శాస్త్రాయ నిపుణులు తెలుపుతున్నారు.
సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయంలో తులసి ఆకులను తుంచకూడదు.
ఆదివారం నాడు తులసి ఆకులను తుంచకూడదు.
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/