Prime9

Today Panchangam : నేటి ( సెప్టెంబర్ 13, 2023 ) పంచాంగం వివరాలు..

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి ( సెప్టెంబర్ 13, 2023 ) బుధ వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి భాద్రపదం 22, శాఖ సంవత్సరం 1945, నిజ శ్రావణ మాసం, క్రిష్ణ పక్షం, చతుర్దశి తిథి, విక్రమ సంవత్సరం 2080. సఫర్ 26, హిజ్రీ 1445(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 13 సెప్టెంబర్ 2023. సూర్యుడు దక్షిణ యానం, గ్రీష్మ బుుతువు, రాహు కాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు. ఈరోజు చతుర్దశి తిథి మరుసటి రోజు తెల్లవారుజామున 4:30 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు మాఘ నక్షత్రం అర్ధరాత్రి 2:01 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పూర్వ ఫాల్గుణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు పగలు, రాత్రి సింహ రాశిలోకి సంచారం చేయనున్నాడు.

నేటి ఉపవాస పండుగ : శివరాత్రి ఉపవాసం, అఘోర చతుర్దశి

సూర్యోదయం సమయం 13 సెప్టెంబర్ 2023 : ఉదయం 6:04 గంటలకు

సూర్యాస్తమయం సమయం 13 సెప్టెంబర్ 2023 : సాయంత్రం 6:29 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..

బ్రహ్మా ముహుర్తం : తెల్లవారుజామున 4:32 గంటల నుంచి ఉదయం 5:18 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:21 గంటల నుంచి మధ్యాహ్నం 3:11 గంటల వరకు

నిశిత కాలం : రాత్రి 11:54 గంటల నుంచి రాత్రి 12:40 గంటల వరకు

సంధ్యా సమయం : సాయంత్రం 6:29 గంటల నుంచి సాయంత్రం 6:52 గంటల వరకు

అమృత కాలం : ఉదయం 6:04 గంటల నుంచి ఉదయం 7:37 గంటల వరకు

నేడు అశుభ ముహుర్తాలివే (Today Panchangam)..

రాహు కాలం : మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

గులిక్ కాలం : ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు

యమ గండం : ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు

దుర్ముహుర్తం : ఉదయం 11:52 గంటల నుంచి మధ్యాహ్నం 12:42 గంటల వరకు, సాయంత్రం 3:35 గంటల నుంచి సాయంత్రం 6:05 గంటల వరకు

నేటి పరిహారం : ఈరోజు వినాయకుడికి లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి.

Exit mobile version
Skip to toolbar