Site icon Prime9

Today Panchangam : నేటి ( మే 29, 2023 ) పంచాంగం వివరాలు..

today panchangam details on november 11 2023

today panchangam details on november 11 2023

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని  లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (మే 29) సోమ వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి జ్యేష్ఠం 08, శాఖ సంవత్సరం 1945, జ్యే్ష్ఠ మాసం, శుక్ల పక్షం, తిథి, విక్రమ సంవత్సరం 2080. జిల్కాద్ 08, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 29 మే 2023. సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు. నవమి తిథి ఉదయం 11:50 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత దశమి తిథి ప్రారంభమవుతుంది. ఉత్తర ఫాల్గుణి నక్షత్రం తెల్లవారుజామున 4:29 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత హస్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాత్రి 9:01 గంటల వరకు వజ్ర యోగం ఉంటుంది. ఆ తర్వాత సిద్ధి యోగం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు సింహ రాశి నుంచి కన్యా రాశిలోకి సంచారం చేయనున్నాడు.

సూర్యోదయం సమయం 29 మే 2023 : ఉదయం 5:24 గంటలకు

సూర్యాస్తమయం సమయం 29 మే 2023 : సాయంత్రం 7:13 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..

అభిజిత్ ముహుర్తం : ఉదయం 11:51 గంటల నుంచి ఉదయం 12:46 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:37 గంటల నుంచి మధ్యాహ్నం 3:32 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 11:58 గంటల నుంచి రాత్రి 12:39 గంటల వరకు

సంధ్యా సమయం : సాయంత్రం 7:11 గంటల నుంచి రాత్రి 7:32 గంటల వరకు

అమృత కాలం : రాత్రి 8:38 గంటల నుంచి రాత్రి 10:23 గంటల వరకు

ఈరోజంతా రవి యోగం ఉంటుంది.

నేడు అశుభ ముహుర్తాలివే (Today Panchangam)..

రాహూకాలం : ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు

గులిక్ కాలం : మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు

యమ గండం : ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు

దుర్ముహుర్తం : మధ్యాహ్నం 12:46 గంటల నుంచి మధ్యాహ్నం 1:41 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 3:32 గంటల నుంచి సాయంత్రం 4:27 గంటల వరకు

నేటి పరిహారం : ఈరోజు శివ లింగానికి పాలు, నీరు, బిల్వ పత్రాలను సమర్పించి, శివ చాలీసా పఠించాలి.

Exit mobile version