Prime9

Today Panchangam : నేటి ( మే 4, 2023 ) పంచాంగం వివరాలు..

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని  లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (మే 24) బుధ వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి జ్యేష్ఠం 03, శాఖ సంవత్సరం 1945, జ్యే్ష్ఠ మాసం, శుక్ల పక్షం, పంచమి తిథి, విక్రమ సంవత్సరం 2080. జిల్కాద్ 03, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 24 మే 2023. సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు. పంచమి తిథి అర్ధరాత్రి 3:01 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత షష్ఠి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 3:06 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పుష్య నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు మిధున రాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేయనున్నాడు.

సూర్యోదయం సమయం 24 మే 2023 : ఉదయం 5:26 గంటలకు

సూర్యాస్తమయం సమయం 24 మే 2023 : సాయంత్రం 7:09 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..

బ్రహ్మ ముహుర్తం : తెల్లవారుజామున 4:36 గంటల నుంచి ఉదయం 5:18 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:47 గంటల నుంచి మధ్యాహ్నం 3:39 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 12:14 గంటల నుంచి రాత్రి 12:57 గంటల వరకు

సంధ్యా సమయం : సాయంత్రం 7:08 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు

రవి యోగం : మధ్యాహ్నం 3:06 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6:01 గంటల వరకు

అమృత కాలం : మధ్యాహ్నం 12:18 గంటల నుంచి మధ్యాహ్నం 2:13 గంటల వరకు

నేడు అశుభ ముహుర్తాలివే (Today Panchangam)..

రాహూకాలం : ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

గులిక్ కాలం : ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు

యమగండం : ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు

దుర్ముహుర్తం : మధ్యాహ్నం 12:09 గంటల నుంచి మధ్యాహ్నం 1:02 గంటల వరకు

నేటి పరిహారం : ఈరోజు దుర్గా దేవిని పూజించి, దుర్గా చాలీసా పఠించాలి.

Exit mobile version
Skip to toolbar