Site icon Prime9

Today Panchangam : నేటి ( మే 19, 2023 ) పంచాంగం వివరాలు..

today panchangam details on november 11 2023

today panchangam details on november 11 2023

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని  లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (మే 19) శుక్రవారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి వైశాఖం 29, శాఖ సంవత్సరం 1945, వైశాఖ మాసం, క్రిష్ణ పక్షం, అమావాస్య తిథి, విక్రమ సంవత్సరం 2080. షవ్వాల్ 28, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 19 మే 2023, సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. అమావాస్య తిథి రాత్రి 9:23 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు భరణి నక్షత్రం 7:30 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత కృత్తిక నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు మేషరాశిలో సంచారం చేయనున్నాడు. అనంతరం వృషభరాశిలో సంచారం చేయనున్నాడు.

నేటి ఉపవాస పండుగ : శని జయంతి, వైశాఖ అమావాస్య, వట సావిత్రి వ్రతం

సూర్యోదయం సమయం 19 మే 2023 : ఉదయం 5:08 గంటలకు

సూర్యాస్తమయం సమయం 19 మే 2023 : సాయంత్రం 7:06 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..

అభిజిత్ ముహుర్తం : మధ్యాహ్నం 11:50 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:34 గంటల నుంచి మధ్యాహ్నం 3:39 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 11:57 గంటల నుంచి రాత్రి 12:38 గంటల వరకు

సంధ్యా సమయం : సాయంత్రం 7:06 గంటల నుంచి సాయంత్రం 7:26 గంటల వరకు

అమృత కాలం : మధ్యాహ్నం 12:17 గంటల నుంచి మధ్యాహ్నం 1:59 గంటల వరకు

నేడు అశుభ ముహుర్తాలివే (Today Panchangam)..

రాహూకాలం : ఉదయం 10:30 గంటల నుంచి ఉదయం 12 గంటల వరకు

గులిక్ కాలం : ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు

యమగండం : మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు

దుర్ముహుర్తం : ఉదయం 8:12 గంటల నుంచి ఉదయం 9:07 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 12:45 గంటల నుంచి మధ్యాహ్నం 1:40 గంటల వరకు

నేటి పరిహారం : ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి. కనకధార స్తోత్రాన్ని పఠించాలి.

Exit mobile version