Site icon Prime9

Today Panchangam : నేటి(మార్చి 26, ఆదివారం) పంచాంగం వివరాలు..

today panchangam details on november 11 2023

today panchangam details on november 11 2023

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో ఫాల్గుణ శుద్ధ మాసంలో నేటి (మార్చి 26 ) ఆదివారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి ఛైత్రం 05 , శాఖ సంవత్సరం 1944, ఛైత్ర మాసం, శుక్ల పక్షం, పంచమి తిథి, విక్రమ సంవత్సరం 2079. రంజాన్ 03, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 26 మార్చి 2023. సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. పంచమి తిథి 4:33 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత షష్ఠి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు కృత్తిక నక్షత్రం మధ్యాహ్నం 2:01 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాత్రి 11:32 గంటల వరకు ప్రీతి యోగం ఉంటుంది. ఆ తర్వాత ఆయుష్మాన్ యోగం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు పగలు, రాత్రి వృషభరాశిలోనే సంచారం చేయనున్నాడు.

నేటి ఉపవాస పండుగ : శ్రీ లక్ష్మీ నాగ పంచమి

సూర్యోదయం సమయం 26 మార్చి 2023 : ఉదయం 6:19 గంటలకు

సూర్యాస్తమయం సమయం 26 మార్చి 2023 : సాయంత్రం 6:35 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే (Today Panchangam)..

అభిజీత్ ముహుర్తం : మధ్యాహ్నం 12:02 గంటల నుంచి మధ్యాహ్నం 12:52 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:19 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 12:30 గంటల నుంచి రాత్రి 12:50 గంటల వరకు

సంధ్యా సమయం : సాయంత్రం 6:34 గంటల నుంచి సాయంత్రం 6:58 గంటల వరకు

అమృత కాలం : ఉదయం 11:33 గంటల నుంచి మధ్యాహ్నం 1:12 గంటల వరకు

రవి యోగం : మధ్యాహ్నం 2:01 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6:18 గంటల వరకు

(Today Panchangam) నేడు అశుభ ముహుర్తాలివే..

రాహూకాలం : సాయంత్రం 4:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు

గులిక్ కాలం : మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు

యమగండం : మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

దుర్ముహర్తం : సాయంత్రం 4:57 గంటల నుంచి సాయంత్రం 5:46 గంటల వరకు

నేటి పరిహారం : నవరాత్రుల్లో ఐదో రోజున స్కందమాతను పూజించాలి. ఏదైనా దేవాలయంలో అన్నదానం చేయాలి.

Exit mobile version