Site icon Prime9

Today Panchangam : నేటి ( జూన్ 27, 2023 ) పంచాంగం వివరాలు..

today panchangam details on october 30 2023

today panchangam details on october 30 2023

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని  లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (జూన్ 27, 2023 ) మంగళ వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి ఆషాఢం 06, శాఖ సంవత్సరం 1945, ఆషాఢ మాసం, శుక్ల పక్షం, నవమి తిథి, విక్రమ సంవత్సరం 2080. జిల్హిజా 08, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 27 జూన్ 2023, సూర్యుడు దక్షిణయానం, వసంత బుుతువు, రాహుకాలం సాయంత్రం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు. నవమి తిథి అర్ధరాత్రి 3:06 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత దశమి తిథి ప్రారంభమవుతుంది. హస్తా నక్షత్రం మధ్యాహ్నం 2:43 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత చిత్రా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు కన్య రాశి నుంచి తులా రాశిలోకి సంచారం చేయనున్నాడు.

నేటి ఉపవాస పండుగ : భడ్లీ నవమి, గుప్త నవరాత్రులు ముగింపు

సూర్యోదయం సమయం 27 జూన్ 2023 : ఉదయం 5:25 గంటలకు

సూర్యాస్తమయం సమయం 27 జూన్ 2023 : సాయంత్రం 7:22 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..

అభిజిత్ ముహుర్తం : మధ్యాహ్నం 12:15 గంటల నుంచి మధ్యాహ్నం 1:08 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:54 గంటల నుంచి మధ్యాహ్నం 3:47 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 12:20 గంటల నుంచి రాత్రి 1:30 గంటల వరకు

సంధ్యా సమయం : సాయంత్రం 7:18 గంటల నుంచి రాత్రి 7:40 గంటల వరకు

రవి యోగం : మధ్యాహ్నం 2:43 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6:04 గంటల వరకు

అమృత కాలం : ఉదయం 8:13 గంటల నుంచి ఉదయం 9:57 గంటల వరకు

నేడు అశుభ ముహుర్తాలివే (Today Panchangam)..

రాహు కాలం : మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు

గులిక్ కాలం : మధ్యా్హ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

యమ గండం : ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు

దుర్ముహుర్తం : ఉదయం 8:43 గంటల నుంచి ఉదయం 9:36 గంటల వరకు, ఆ తర్వాత అర్ధరాత్రి 11:37 గంటల నుంచి రాత్రి 12:20 గంటల వరకు

నేటి పరిహారం : ఈరోజు బెల్లం నూనెలో సింధూరం కలిపి హనుమంతుడికి సమర్పించాలి.

Exit mobile version