Today Panchangam : నేటి ( జూన్ 16, 2023 ) పంచాంగం వివరాలు..

హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని  లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - June 16, 2023 / 07:37 AM IST

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని  లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (జూన్ 16 , 2023 ) శుక్ర వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి జ్యేష్ఠం 26, శాఖ సంవత్సరం 1945, జ్యేష్ఠ మాసం, క్రిష్ణ పక్షం, త్రయోదశి తిథి, విక్రమ సంవత్సరం 2080. జిల్కాద్ 26, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 16 జూన్ 2023. సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. త్రయోదశి తిథి ఉదయం 8:41 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు కృత్తిక నక్షత్రం మధ్యాహ్నం 3:07 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు వృషభరాశిలో చంద్రుడు పగలు, రాత్రి సంచారం చేయనున్నాడు.

నేటి ఉపవాస పండుగ : మాస శివరాత్రి ఉపవాసం

సూర్యోదయం సమయం 16 జూన్ 2023 : ఉదయం 5:23 గంటలకు

సూర్యాస్తమయం సమయం 16 జూన్ 2023 : సాయంత్రం 7:21 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..

బ్రహ్మ ముహుర్తం : ఉదయం 4:03 గంటల నుంచి ఉదయం 4:43 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:41 గంటల నుంచి మధ్యాహ్నం 3:37 గంటల వరకు

నిశిత కాలం : రాత్రి 12:02 గంటల నుంచి రాత్రి 12:42 గంటల వరకు

సంధ్యా సమయం : రాత్రి 7:19 గంటల నుంచి రాత్రి 7:39 గంటల వరకు

అమృత కాలం : మధ్యాహ్నం 12:37 గంటల నుంచి మధ్యాహ్నం 2:17 గంటల వరకు

నేడు అశుభ ముహుర్తాలివే (Today Panchangam)..

రాహూ కాలం : ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు

గులిక్ కాలం : ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు

యమగండం : మధ్యాహ్నం 3:30 గంటల నుంచి మధ్యాహ్నం 4:30 గంటల వరకు

దుర్ముహుర్తం : ఉదయం 8:11 గంటల నుంచి ఉదయం 9:06 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 12:50 గంటల నుంచి మధ్యాహ్నం 1:46 గంటల వరకు

భద్ర కాలం : ఉదయం 8:39 గంటల నుంచి ఉదయం 8:52 గంటల వరకు

నేటి పరిహారం : ఈరోజు లక్ష్మీదేవితో పాటు శివుడిని పూజించాలి.