Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (మే 27) శని వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
రాష్ట్రీయ మితి జ్యేష్ఠం 06, శాఖ సంవత్సరం 1945, జ్యే్ష్ఠ మాసం, శుక్ల పక్షం, సప్తమి తిథి, విక్రమ సంవత్సరం 2080. జిల్కాద్ 06, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 27 మే 2023. సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు. ఈరోజు సప్తమి తిథి ఉదయం 7:43 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత అష్టమి తిథి ప్రారంభమవుతుంది. పూర్వ ఫాల్గుణి నక్షత్రం 11:43 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత మాఘ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు పగలు, రాత్రి సింహరాశిలో చంద్రుడు చేయనున్నాడు.
సూర్యోదయం సమయం 27 మే 2023 : ఉదయం 5:25 గంటలకు
సూర్యాస్తమయం సమయం 27 మే 2023 : సాయంత్రం 7:12 గంటలకు
అభిజిత్ ముహుర్తం : ఉదయం 11:51 గంటల నుంచి మధ్యాహ్నం 12:46 గంటల వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:36 గంటల నుంచి మధ్యాహ్నం 3:31 గంటల వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 11:58 గంటల నుంచి రాత్రి 12:39 గంటల వరకు
సంధ్యా సమయం : రాత్రి 7:10 గంటల నుంచి రాత్రి 7:31 గంటల వరకు
అమృత కాలం : రాత్రి 9:02 గంటల నుంచి రాత్రి 10:50 గంటల వరకు
రాహూకాలం : ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు
గులిక్ కాలం : ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7:30 గంటల వరకు
యమ గండం : మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు
దుర్ముహుర్తం : ఉదయం 5:25 గంటల నుంచి ఉదయం 7:15 గంటల వరకు
భద్ర కాలం : ఉదయం 7:42 గంటల నుంచి రాత్రి 8:51 గంటల వరకు
నేటి పరిహారం : ఈరోజు ఒక స్టీలు గిన్నెలో ఆవాల నూనె తీసుకుని, అందులో మీ ముఖం చూసి అందులో ఒక నాణెం వేసి అవసరం ఉన్నవారికి దానం చేయాలి.