Nagula Chavithi 2022: నేడు నాగుల చవితిని ఘనంగా జరుపుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల భక్తులు ఉదయం నుంచి గుడికి వెళ్ళి పూజలు చేస్తున్నారు. ప్రతి యేడు ఈ పండుగను కార్తీక శుద్ధ చతుర్థి నాడు జరుపుకుంటారు. కానీ ఈ ఏడాది మాత్రం నాగుల చవితిని ఈ రోజు అంటే అక్టోబరు 29, శనివారం ఉదయం 10:30 గంటల లోపు పుట్టల వద్దకు కుటుంబ సమేతంగా వెళ్లి పూజలు చేస్తున్నారు. ఈ నాగులు చవితి సందర్భంగా కోడిగుడ్లు, పూజాసమాగ్రి, పూలు, పండ్లు ధరలు బాగా పెరిగాయి. ఇనా సరే ప్రజల మాత్రం కొనుగోళ్లు చేస్తున్నారు. ఈ రోజున కొంతమంది ఇంట్లో నాగదేవత విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తారు. మరికొందరు పుట్టవద్దకు వెళ్లి పుట్టలో పాలు పోసి నాగారాధన చేస్తారు.
నాగుల చవితి రోజు ఆవు పాలను పుట్టలో పోసి నాగపూజ చేస్తారు. పూజ ఐపోయిన తరువాత చలిమిడి, అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు, తేగలు నాగ దేవతకు నైవేద్యంగా పెడతారు. హిందువులు నాగపామును దేవతగా కొలుస్తారు. మన పురాణాల్లో కూడా ఈ నాగుల చవితి పండుగకు సంబంధించి ఎన్నో కథలు ఉన్నాయి. అంతే కాకుండా ప్రతి ఒక్కరిలో ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఇలాంటి విష గుణాలన్ని పోవాడానికి విషసర్పాల పుట్టల వద్దకు వెళ్లి పాలు పోయాలని పురాణాలు చెబుతున్నాయి .
నాగల చవితి నాడు నాగ దేవతను పూజిస్తే సర్వ దోషాలు పోతాయని భక్తులు నమ్ముతుంటారు. అంతేకాకుండా ఈ రోజు సంతానం లేని దంపతులు నాగదేవతకు పూజ చేస్తే..వాళ్ళకి పిల్లలు కలుగుతారని భక్తులు బాగా నమ్ముతారు.