Site icon Prime9

Horoscope: నేడు ఈ రాశుల వారికి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయని మీకు తెలుసా

daily horoscope details of different signs on august 29 2023

daily horoscope details of different signs on august 29 2023

Horoscope: జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల లోని వారికి ఆర్థికలావాదేవీలు సత్ఫలితాలను ఇస్తాయి. ప్రేమలో ఉన్న వారు ముందడు వేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మరి ఆ రాశుల వారు ఎవరో ఏప్రిల్ 7వ 2023 తేదీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి శుభవార్తలు వినిపిస్తాయి. ఉద్యోగంలో కొత్త లక్ష్యాలను పూర్తి చేస్తారు ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మీ జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది.

వృషభం: ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఉద్యోగంలో నిలకడ లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు వాయిదా పడతాయి. కష్టసమయంలో తల్లిదండ్రుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఉపశమనం లభిస్తుంది.

మిథునం: కష్టసమయంలో స్నేహితులు అండగా నిలబడతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. మీకు స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పర్వాలేదు.

కర్కాటకం: ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఇంటా బయటా క్షణం తీరికి లేకుండా గడుపుతారు. ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. ఆర్థిక సంబంధ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం ఉత్తమం. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది.

సింహం: ఉద్యోగ వ్యాపారాలలో వృద్ధి కనిపిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి.

కన్య: ఉద్యోగ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా బాధిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో కష్టం ఎక్కువవుతుంది. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది. సమయం అనుకూలంగా లేనందువల్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.

తుల: ఆర్థికపరంగా లాభపడతారు. గృహం లేదా వాహనాలు కొనుగోలు చేయాలనుకునేవారి యోచనలు ఫలిస్తాయి. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు కొనసాగుతాయి. ఆరోగ్యం చాలావరకు పరవాలేదు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి సంబంధం కుదరవచ్చు.

వృశ్చికం: ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకునేందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారు. ఆర్థికంగా బాగానే ఉంటుంది. అప్పుల బాధలు కొద్దిగా తగ్గు ముఖం పడతాయి. సడెన్ జర్నీలకు అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలిస్తుంది. హామీలు ఉండటం, వాగ్దానాలు చేయడం మంచిది కాదు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యాపారంలో మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.

ధనుస్సు: ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ అనవరస ఖర్చులు వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆర్థిక లావాదేవీల జోలికి పోకపోవడం ఉత్తమం. రోడ్డు ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో సంతోషకర జీవితం గడుపుతారు. వృత్తి వ్యాపారాల్లో స్తిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగంలో చికాకులు ఉంటాయి. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంటుంది.

మకరం: ఉద్యోగ జీవితం చాలా ఉత్సాహంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి కొంచెం ఉపశమనం లభిస్తుంది. అనారోగ్యాల నుంచి కోలుకునే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది.

కుంభం: ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. అడిగినవారందరికీ మితిమీరి సహాయం చేసి ఇబ్బంది పడతారు. ఉద్యోగ జీవితం బాగానే ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా ఆర్థిక పరిస్థితి యథాతథంగానే ఉంటుంది. వృత్తి నిపుణులకు మంచి ఆఫర్లు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్త అందుకుంటారు.

మీనం: వృత్తి వ్యాపారాల్లో అధిక శ్రమను చవిచూస్తారు. బంధుమిత్రుల నుంచి సహాయం లభించదు. ఆర్థికంగా బాగానే ఉంటుంది. దుబారా ఖర్చుల వల్ల ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొద్దిపాటి ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఇప్పట్లో ఉద్యోగం మారే అవకాశం లేదు.

Exit mobile version
Skip to toolbar