Site icon Prime9

Horoscope: ఉద్యోగపరంగా నేడు ఈ రాశుల వారికి శుభవార్త అందుతుంది..

daily horoscope details of different signs on july 17 2023

daily horoscope details of different signs on july 17 2023

Horoscope: హిందూ సంప్రదాయం ప్రకారం రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. అయితే, 12 రాశుల వారికి జూన్ 05వ తేదీ, సోమవారం దినఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: ఆదాయం బాగానే ఉంటుంది కానీ అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. అటు ఉద్యోగపరంగా, ఇటు కుటుంబ పరంగా బరువ బాధ్యతలు పెరుగుతాయి. ఇంటా బయట తిప్పట ఎక్కువగా ఉంటుంది. వ్యాపార విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి.

వృషభం: ఉద్యోగపరంగా శుభవార్త అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ప్రయోజనం కలిగించవు. విద్యార్థులకు అన్ని విధాలుగాను బాగుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

మిథునం: ఆదాయం వృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగంలో అధికారులను బాధ్యతలు పెరుగుతాయి. గృహ, వాహనాల కొనుగోలు మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. పెళ్లి సంబంధం విషయాలు సఫలం అవుతాయి. ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది.

కర్కాటకం: ఆర్థికంగా నిలకడగా ఉంటారు. పొదుపు సూత్రాలు పాటిస్తారు. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. కుటుంబపరంగా ఏది జరిగినా అంతా మన మంచికే అనుకోండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల లాభసాటిగా ఉంటాయి.

సింహం: నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఐటీ, క్రీడలు, స్వయం ఉపాధి, రియల్ ఎస్టేట్ వంటి రంగాలవారు అద్భుతంగా రాణించే అవకాశం ఉంది. విద్యార్థులు ఎంతో శ్రమ పడాల్సివస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.

కన్య: ఉద్యోగ పురోగతి ఉంటుంది. ఆదాయపరంగా స్థిరత్వం లభిస్తుంది. విద్యార్థులు విజయాలను సాధిస్తారు. ప్రేమ వ్యవహారంలో ముందడుగు వేస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది.

తుల: ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయంలో కొద్దిపాటి పెరుగుదల ఉంటుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది.

వృశ్చికం: ఉద్యోగంలో పురగతి సాధిస్తారు. కుటుంబ జీవనం సాఫీగా సాగుతుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. శరీరానికి విశ్రాంతి అవసరం. ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుతాయి.

ధనుస్సు: ఉద్యోగాల్లో శ్రమ పెరుగుతుంది. అధికారులు నుంచి అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది. విద్యార్థులు బాగా కష్టపడితేనే విజయాలను అందుకుంటారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

మకరం: ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. మీ అవసరానికి ఏదో ఒక రూపంలో ఆర్థిక సహాయం అందుతుంది. ఆనారోగ్యంతో ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. సహచరుల నుంచి సహకారం లభిస్తుంది.

కుంభం: ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. తోబుట్టువులకు వీలైనంతగా సహాయం చేస్తారు. విద్యార్థులు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగ జీవితం సాఫీగా ఉంటుంది. కుటుంబంతో సరదాగా కాలం గడుపుతారు.

మీనం: ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి బాగా పెరుగుతాయి. ఆదాయంలో పెరుగుదల మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.

Exit mobile version