Site icon Prime9

Horoscope: నేడు ఈ రాశుల వారికి ఆర్థిక పరిస్థితి లాభదాయకంగా ఉంటుందని తెలుసా

daily horoscope details of different signs on august 29 2023

daily horoscope details of different signs on august 29 2023

Horoscope: హిందూ సంప్రదాయం ప్రకారం రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. అయితే, 12 రాశుల వారికి జూన్ 01వ తేదీ, గురువారం దినఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: ఆర్థిక ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగంలో పురోభివృద్ధి ఉంటుంది. కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతారు. అనారోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు విజయాలు సాధిస్తారు.

వృషభం: శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. ఐటీ నిపుణులకు గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. చేతికి రావాల్సిన డబ్బు సరైన సమయానికి అందుతుంది. ఆకస్మిక ధన లాభం ఉంటుంది.

మిథునం: ఉద్యోగంలో పురోభివృద్ధి సాధిస్తారు. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పిల్లలు చదువుల్లో బాగా కష్టపడాల్సి ఉంటుంది. కొద్దిపాటి అనారోగ్యం సంభవించే సూచనలు ఉన్నాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

కర్కాటకం: ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. చదువుల్లో పిల్లలు పురోగతి చెందుతారు. వృత్తి వ్యాపారాలు లాభాలు గడిస్తారు. చాలాకాలంగా వేధిస్తోన్న అనారోగ్య సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

సింహం: ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది. బంధువులతో అపార్ధాలు తలెత్తుతాయి. కాబట్టి ఆచితూచి మాట్లాడడం మంచిది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. అనవసర ఖర్చులను తగ్గించుకుంటే మంచిది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.

ఈ రాశుల(Horoscope) వారు ఆరోగ్యం జర భద్రం

కన్య: వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో మెప్పులు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి.

తుల: ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. దాంపత్య జీవితం చాలా అన్యోన్యతగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శ్రద్ధ అవసరం. ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

వృశ్చికం: ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. అనవసర ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. వృత్తి వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తెలెత్తుతాయి. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి.

ధనుస్సు: ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారం నిలకడగా ముందుకు సాగుతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. ఆరోగ్యానికి మెరుగ్గా ఉంటుంది.

మకరం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కాస్త ఆచి తూచి ఇతరులకు సహాయం చేయండి. కుటుంబంలో ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి.

కుంభం: ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. పిల్లలు చదువులో రాణిస్తారు. ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ అవసరం. కుటుంబ జీవితం బాగుంటుంది. సరదాగా కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు.

మీనం: ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు. అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది.

Exit mobile version