Site icon Prime9

Horoscope: ఈ రాశులవారికి శత్రువులు కూడా మిత్రులుగా మారతారు.. నేడు 12 రాశుల వారి దినఫలాలు ఇలా

daily horoscope details

daily horoscope details

Horoscope: జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశులలోని వారికి శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. కాగా జూలై 15 వ తేదీన 12 రాశుల వారి దినఫలాలు (Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

మేషం: ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. ఉద్యోగ జీవితం చాలా ఉత్సాహంగా సాగిపోతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా మంచిది. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఎప్పుడు ఏ ప్రయత్నం తలపెట్టినా చాలా వరకు సఫలం అయ్యే అవకాశం ఉంది.

వృషభం: కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలు విందుల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో దాదాపు విజయం సాధిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు సాధిస్తారు.

మిథునం: ముఖ్యమైన వ్యవహారాలను, పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో బరువు, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలోనూ, ప్రయాణాల విషయంలోనూ జాగ్రత్త అవసరం.

కర్కాటకం: ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కుటుంబ జీవితం చాలావరకు అనుకూలంగా సాగిపోతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగ విషయంలో అధికారుల మెప్పు పొందుతారు.

సింహం: వృత్తి, ఉద్యోగాలలో పనిభారం పెరిగినప్పటికీ, ఆశించిన స్థాయిలో గుర్తింపు, ప్రతిఫలం కూడా లభిస్తాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంది. చిన్ననాటి మిత్రులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. వ్యాపారంలో లాభాలు పొందుతారు.

కన్య: ఆర్థిక వ్యవహారాల్లో మంచిఫలితాలు పొందుతారు. అనారోగ్య సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీకు ప్రాధాన్యత పెరుగుతుంది. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రయాణ విషయంలో జాగ్రత్తగా తప్పనిసరి.

తుల: అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలను పాటించడం మంచిది. పని భారం కాస్తంత ఎక్కువగానే ఉన్నప్పటికీ ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి.

వృశ్చికం: వృత్తి నిపుణులకు ఈ రోజు చాలా ప్రయోయజనకరంగా ఉంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలన్నీ చాలావరకు పూర్తవుతాయి. నిరుద్యోగులు ఉద్యోగం లభిస్తుంది. కుటుంబ జీవితం సాగిపో తుంది.

ధనుస్సు: చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. శత్రువులు మిత్రులుగా మారి సహకరిస్తారు. చిరకాల వాంఛ ఒకటి అనుకోకుండా నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త అవసరం.

మకరం: వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొత్త ఆలోచనలు, కొత్త ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్య సంబంధమైన జాగ్రత్తలు పాటించడం మంచిది. కుటుంబ వ్యవహారాలలో జీవిత భాగస్వామిని కూడా సంప్రదింపులు చాలా అవసరం.

కుంభం: వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తి కరంగా సాగిపోతుంది. వ్యాపారాలలో కొద్దిగా లాభాలు తగ్గే సూచనలున్నాయి. ఉద్యోగుల మీద అదనపు బాధ్యతల భారం ఉంటుంది. ప్రస్తుతానికి ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం కొద్దిగా పరవాలేదనిపిస్తుంది.

మీనం: శుభకార్యాలు, పుణ్య కార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది.

Exit mobile version